నటి హేమకు మరో షాక్.. ‘MAA’ అసోసియషన్ నుంచి సస్పెండ్..?

రేవ్ పార్టీలో పట్టుబడిన నటి హేమకు మరో షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆమెను MAA మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గతంలో హేమపై ఆరోపణలు వచ్చినప్పుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. హేమ ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటోందని మంచు విష్ణు ట్విట్టర్‌లో తెలిపారు.

రేవ్ పార్టీకి వెళ్లిన ప్రముఖులందరికీ బెంగళూరు క్రైం పోలీసులు నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో తెలుగు నుంచి హేమ కూడా ఉన్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు హేమ హాజరుకాలేదు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు లేఖ రాసింది. పోలీసులు లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే సోమవారం హేమను ప్రత్యేకంగా విచారణకు ఆహ్వానించారు.

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరైన వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వారు ఇచ్చిన రక్త నమూనాలు పాజిటివ్‌గా వచ్చాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం సాయంత్రం అందులో పాల్గొన్న నటి హేమతో సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే హేమను ‘MAA’ నుంచి సస్పెండ్ చేయాలని సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.