Egg Bonda : సాయంత్రం పూట అప్పుడప్పుడు Egg Bonda తినండి. ఇది శక్తిని అందిస్తుంది. సాయంత్రం పూట egg noodles తింటే రాత్రి పూట ఎక్కువ ఆహారం తినాలనిపించదు.
ఇది బరువును కూడా తగ్గిస్తుంది. ఎగ్ బోండా రిసిపి చాలా సులభం. ఒక్కసారి ట్రై చేసి చూడండి… సాస్ లో ముంచిన ఈ Egg Bonda రుచి అదిరిపోతుంది.
Egg Bonda రిసిపికి కావలసినవి
గుడ్లు – నాలుగు
శనగ పిండి – ఒకటిన్నర కప్పు
ఉప్పు – రుచికి
బేకింగ్ సోడా – చిటికెడు
మిరియాల పొడి – ఒక చెంచా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
కారం – అర చెంచా
ఎగ్ బోండా రిసిపి
1. గుడ్లను ముందుగా ఉడకబెట్టి, షెల్ తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండిని ఉండలు లేకుండా వేయాలి.
3. దానికి ఉప్పు, కారం, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
4. నీళ్లు పోసి బాగా కలపాలి.
5. స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.
6. నూనె వేడెక్కిన తర్వాత గుడ్లను శనగపిండిలో ముంచి వేడిచేసిన నూనెలో వేయాలి.
7. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
8. తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ బోండాను రెండు ముక్కలుగా కట్ చేసి పైన మిరియాల పొడి చల్లాలి.
9. అలా తింటే చాలా రుచిగా ఉంటుంది. లేదా పిల్లలకు మిరియాల పొడి కారంగా అనిపిస్తే టొమాటో సాస్ లో తింటే మంచిది.
ఈవెనింగ్ స్నాక్స్ కు Egg Bonda బెస్ట్ రిసిపి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు సాయంత్రం పూట ఈ Egg Bonda తింటే రాత్రికి అన్నం తినాల్సిన పనిలేదు. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గవచ్చు. అలాగే కోడి గుడ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి పౌష్టికాహారలోపం భయం లేదు.