Pm Surya Ghar Scheme :
దేశంలోని కోట్లాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 300 units free electricity ఇస్తోంది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి? షరతులు ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రతినెలా 300 units free electricity ను అందించే పనిని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో Rooftop solar pane పథకాన్ని ప్రకటించి ఇప్పుడు అమలులోకి తెచ్చారు.
ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద 300 units free electricity ఇవ్వబోతున్నారు. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది ఇళ్లకు solar panel ను అందించి, ఉచిత విద్యుత్ అందించి వారికి ఆదాయ మార్గం కూడా చూపారు.
Related News
దేశంలోని కోట్లాది ఇళ్లలో ఉచితంగా వెలుగులు నింపాలని, సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. రూ.75 వేల కోట్లతో ఈ పథకం అమలవుతుండగా ఇందులో భాగమైన వారికి రూ.78 వేల వరకు subsidy లభిస్తుంది. ఇప్పుడు చూద్దాం.
PM Surya Ghar – Muft Bijli Yojana పేరుతో అమలవుతున్న ఈ పథకంలో భాగంగా వారి ఇళ్ల పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చి వాటి ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు స్థానిక పోస్టాఫీసుకు వెళ్లవచ్చు. లేదా online లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. Registrations ఇప్పటికే తెరిచి ఉన్నాయి.
ఇంటి పైకప్పుపై solar panel బిగించడానికి దాదాపు లక్షా 80 వేల వరకు ఖర్చవుతుంది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 78 వేలు. మిగిలిన మొత్తాన్ని EMI మోడ్‌లో చెల్లించవచ్చు. ఈ పథకంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో solar panel ను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
ఈ పథకంలో సౌర ఫలకాలను పొందడానికి ముందుగా https://pmsuryaghar.gov.in website ను సందర్శించి పూర్తి వివరాలను నమోదు చేయండి. ఆ వెబ్సైట్లో ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా మీరు ఈ sceme కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను రూపొందిస్తోంది.
1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్ రోజుకు 4 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాంటి మూడు పలకలను మన ఇంటిపై అమర్చాలి. ఇలా రోజుకు 12 యూనిట్ల చొప్పున.. నెలకు 360 units of solar electricity ఉత్పత్తి అవుతుంది.
సౌర ఫలకాల జీవితకాలం దాదాపు 25 సంవత్సరాలు. అంతేకాకుండా, మీ పెట్టుబడి కూడా 5.32 సంవత్సరాలలోపు తిరిగి వస్తుంది. మిగిలిన వ్యవధిలో కరెంట్‌ని ఉచితంగా ఉపయోగించవచ్చు. అంటే ఎలాంటి ఖర్చు లేకుండా 360 units electricity scheme పొందవచ్చు.