కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఫైర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులు 02/2024 బ్యాచ్ పేరుతో INS చిల్కాలో శిక్షణ పొందుతారు. దరఖాస్తు ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification వివరాలు:
* అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్- SSR) ఖాళీలు
Related News
అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ రెండేళ్ల వొకేషనల్ కోర్సు లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులు ఉత్తీర్ణత.
వయస్సు: అభ్యర్థి 01.11.2003 – 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులు, స్త్రీలు కనీసం 157 సెం.మీ. ఎక్కువగా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్-1 (ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్), స్టేజ్-2 (వ్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్- PFT), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
శిక్షణ: ఫైర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులు నవంబర్ నెలలో ఒడిశాలోని INS చిల్కాలో తమ కోర్సు శిక్షణను ప్రారంభిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Salary and Allowances : ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో సంవత్సరంలో రూ.33 వేలు, మూడో సంవత్సరంలో రూ.36500, నాలుగో సంవత్సరంలో రూ.40 వేలు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీషులో 100 మార్కులతో కలిపి మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఒక్కొక్కటి 1 మార్కుతో ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్… నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ప్రతికూల మార్కింగ్ అమలు చేయబడుతుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.550.
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 13-05-2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ, ఫీజు చెల్లింపు: 27-05-2024.
- శిక్షణ ప్రారంభం: 2024, నవంబర్ నెలలో.