వీరికి ప్రతినెలా 10,000.. బడ్జెట్‌ 2024 లో కీలక ప్రకటన ఈరోజు?

ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని, పథకం ప్రయోజనాలను కూడా పెంచుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం నెలకు రూ.5 వేలు ఇస్తోంది. ఇక నుంచి ప్రతినెలా రూ.10 వేలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. july  23న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈ 10 వేలకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో Atal Pension Yojana ఒకటి. ఈ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కేంద్రం చేయనున్న ఈ కీలక మార్పులతో ఈ పథకం లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయని తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతినెలా లబ్ధిదారులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తోంది. అనే కోణంలో కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నెలవారీ పింఛను రూ.5000ను రూ.10వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

2015 బడ్జెట్‌లో కేంద్రం అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం Atal Pension Yojana scheme  ప్రవేశపెట్టింది. నెలకు 1000 నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ పొందే వెసులుబాటును కల్పించింది. ఈ పథకంలో చేరేందుకు వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయం ప్రతి నెలా చెల్లించే ప్రీమియంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 6.62 కోట్ల మంది ఈ పథకంలో పాలుపంచుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.22 కోట్ల మంది చేరారు. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించిన తర్వాత, 2023-24లో ఎక్కువ మంది ఈ పథకంలో చేరతారని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ దీపక్ మొహంతి తెలిపారు.

Related News

అలాగే ఈ పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న పింఛను సొమ్ము భవిష్యత్తు అవసరాలకు సరిపోదని, పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో Atal Pension Yojana scheme  ప్రయోజనాలను పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. july  23న బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని.. అదే జరిగితే లబ్ధిదారులకు శుభవార్తేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.