తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడు, ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇటీవల కేదార్ సెలగంశెట్టి విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం.. గం.. గణేశ’ చిత్రాన్ని నిర్మించారు. కేదార్ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాత బన్నీ వాసుకు కూడా చాలా సన్నిహితుడు.
గతంలో ముత్తయ్య సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా కేదార్ బ్యానర్లోనే విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఊహించని మరణం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేదార్ మరణానికి కారణాలు తెలియరాలేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆయన దుబాయ్‌కి ఎందుకు వెళ్లారు? విషయాలు తెలియాల్సి ఉంది.