Pension scheme: రూ.7 పెట్టి జీవితాంతం ఆదాయం.. ఈ పెన్షన్ స్కీం మీకు తెలిసి ఉండదు…

వృద్ధాప్యంలో ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. అప్పట్లో నెలవారీ ఖర్చుల్ని భరించడం చాలా కష్టం అవుతుంది. అందుకే చాలా మందికి పెన్షన్ గురించి భయం ఉంటుంది. ఉద్యోగం చేసే సమయంలో సేవింగ్స్ సరిగా లేకపోతే రిటైర్మెంట్ తర్వాత జీవితం కష్టమవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థికంగా నిలబెట్టే ఓ అద్భుతమైన పథకం మన దేశంలోనే అందుబాటులో ఉంది. దీంట్లో రోజుకు కేవలం రూ.7 కడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది.

ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీం ఇప్పుడు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. గతేడాది మాత్రమే ఈ పథకంలో 1.17 కోట్ల మందికి పైగా కొత్తగా చేరారు. అంటే ఈ స్కీంపై ఎంత విశ్వాసముందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ మొత్తం 7.60 కోట్ల మందికిపైగా ఈ పథకం కింద లాభం పొందుతున్నారు. ఇందులో పెట్టిన మొత్తాలు కూడా భారీగానే పెరిగాయి. ఇప్పటివరకు రూ.44,780 కోట్లకు పైగా పెన్షన్ నిధులు చేరినట్టు ప్రభుత్వం తెలిపింది.

Related News

ఎందుకు స్పెషల్‌ ఈ పథకం?

అటల్ పెన్షన్ యోజనను ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారికి ఊహించి రూపొందించారు. రోజుకు రూ.7 అంటే నెలకి రూ.210 మాత్రమే. మీరు ఈ పథకంలో పదవీ విరమణ అయ్యే వరకు పెట్టుబడి పెడుతూ వస్తే, 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5000 పెన్షన్ వస్తుంది.

ఇది మీ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరిచిపోవలేనిదేంటి అంటే.. మీరు పెన్షన్ తీసుకునే ముందు మరణిస్తే, ఆ పథకంలో ఉన్న మొత్తం మీ జీవిత భాగస్వామికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆమె కూడా మరణిస్తే, మొత్తం డిపాజిట్‌ నామినీకి అందుతుంది.

ఇది ఒకరకంగా కుటుంబాన్ని భద్రతగా నిలబెట్టే లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఇక ఈ స్కీంలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకీ పెరుగుతుంది. ఇటీవల చేరినవారిలో సగం మంది మహిళలే కావడం గమనార్హం. ఇది వారి భవిష్యత్‌ను ఆర్థికంగా బలపడేలా చేస్తోంది.

ఎవరెవరు అర్హులు?

ఈ పథకం కోసం భారతదేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటే చాలు. మీరు ప్రతినెలా ఎంపిక చేసుకున్న మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లేదా బ్యాంక్ ద్వారా చెల్లించవచ్చు. తర్వాత మీరు 60 ఏళ్ల వయస్సుకు వచ్చాక నెలవారీగా పెన్షన్ తీసుకోవచ్చు. ఈ స్కీంలో పెట్టిన మొత్తాలపై ఆదాయపన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 80C సెక్షన్ కింద మీరు ట్యాక్స్ సేవింగ్‌ బెనిఫిట్ పొందవచ్చు.

పెన్షన్ ఎంత వస్తుంది?

మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తారో.. నెలకు ఎంతమొత్తం చెల్లిస్తారో బట్టి మీ పెన్షన్ నిర్ణయమవుతుంది. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు, మీరు 18 ఏళ్ల వయస్సులో చేరి నెలకు రూ.210 చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత మీరు నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు. ఇది ఒక చిన్న పెట్టుబడితో భద్రమైన భవిష్యత్‌ను కల్పించే అద్భుతమైన అవకాశం.

ఫైనల్ గా చెప్పాలంటే..

జనం దృష్టిలో ఈ స్కీం గురించి ఇప్పటికీ తక్కువ తెలుసు. కానీ తెలివైనవాళ్లు ఇప్పటికే చేరిపోయారు. రోజుకు ఒక టీ తాగినంత డబ్బు పెట్టుబడి పెట్టి, భవిష్యత్‌ను సురక్షితంగా మార్చుకోవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఆలస్యం చేయకుండా అటల్ పెన్షన్ యోజనలో ఇప్పుడే చేరండి. ఒకసారి రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఈ పథకం వల్ల వచ్చే లాభాలు చూసి మీరు గర్వపడతారు.