ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన తన కుమార్తె వర్ష రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఆయన ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘వర్ష రెడ్డికి అభినందనలు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ లండన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మీరు మమ్మల్ని చాలా గర్వపడేలా చేశారు. దేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.’ అని ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు.