రిటైర్మెంట్ తర్వాత నెలకు ₹1 లక్ష పింఛన్… ఇప్పుడే ఈ స్కీమ్‌లో పెట్టుబడి వేయండి…

మీకు రిటైర్మెంట్ తర్వాత కూడా నెలకు లక్షల్లో ఆదాయం రావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సరైన ప్లానింగ్ ప్రారంభించాలి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనే ప్రభుత్వ పథకం ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా నెలనెలా పింఛన్ రావడంతో పాటు, రిటైర్మెంట్‌ సమయంలో భారీగా లంప్ సమ్ ఫండ్ కూడా పొందవచ్చు.

 NPS అంటే ఏమిటి?

  •  ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్
  •  60% మొత్తాన్ని లంప్ సమ్‌గా తీసుకోవచ్చు, మిగిలిన 40% ను పెన్షన్‌ ప్లాన్‌లో పెట్టాలి
  •  నెలకు లేదా సంవత్సరానికి ఒకసారి ఇన్వెస్ట్ చేయవచ్చు
  •  పింఛన్‌తో పాటు ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి

రిటైర్మెంట్ తర్వాత నెలకు ₹1 లక్ష పింఛన్ పొందడం ఎలా?

మీకు రిటైర్మెంట్ తర్వాత నెలకు ₹1 లక్ష రావాలంటే, ఇప్పుడు సరైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణగా:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  •  మీ వయస్సు 40 ఏళ్లు ఉంటే
  •  నెలకు ₹20,000 NPS లో ఇన్వెస్ట్ చేస్తే
  •  10% వార్షిక రిటర్న్ రేట్ ప్రకారం
  •  20 ఏళ్లలో మీ మొత్తం ఫండ్ ₹3.23 కోట్లు అవుతుంది
  •  దీనిలో ₹1.62 కోట్లు లంప్ సమ్‌గా తీసుకోవచ్చు
  •  మిగిలిన ₹1.62 కోట్లు ఎన్యూయిటీ స్కీమ్‌లో పెడితే
  •  నెలకు ₹1,00,000 పెన్షన్ గా వస్తుంది.

ఇలా మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్ల సంపదతో ఆర్థిక భద్రత పొందవచ్చు

NPS లో ఇన్వెస్ట్ చేయడంలోని ప్రయోజనాలు

  •  నెలకు లైఫ్‌టైం పెన్షన్ లభిస్తుంది
  •  ఆర్థిక భద్రతతో పాటు, ట్యాక్స్ మినహాయింపులు
  •  80C, 80CCD(1B) కింద ₹2 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు
  •  స్టాక్ మార్కెట్, బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో సమతుల్య పెట్టుబడి ఉండడం వల్ల రిస్క్ తక్కువ
  •  కోట్లకు చేరుకునే పొదుపు, రిటైర్మెంట్ తర్వాత స్టెడీ ఇన్‌కమ్

NPS ఖాతా ఎప్పుడు ఓపెన్ చేయాలి?

  1.  30-40 ఏళ్ల మధ్య ప్రారంభిస్తే మంచి లాభం – ఈ వయస్సులో 75% వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది
  2.  50 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే ఈక్విటీ ఎక్స్‌పోజర్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కొంచెం తగ్గొచ్చు

 NPS ఖాతా ఎలా ఓపెన్ చేయాలి?

  •  ఆన్‌లైన్ (eNPS వెబ్‌సైట్) లేదా బ్యాంక్/పోస్ట్ ఆఫీస్‌లో అఫ్లైన్ ద్వారా
  •  Aadhaar, PAN, మొబైల్ నెంబర్ అవసరం
  •  KYC పూర్తయిన తర్వాత UAN నెంబర్ వస్తుంది, దాని ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు

ఆలస్యం చేస్తే కోట్లలో నష్టం… ఇప్పుడే పెట్టుబడి పెట్టండి…

  •  30-40 ఏళ్లలో ప్రారంభిస్తే నెలకు లక్షల్లో పెన్షన్ పొందొచ్చు
  •  వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం ఇదే బెస్ట్ స్కీమ్.
  •  ఇప్పటికే వెనకబడ్డారా? ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించండి.

మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఇప్పుడే NPS ఖాతా ఓపెన్ చేయండి… రిటైర్మెంట్ తర్వాత కూడా కోటీల ఆదాయాన్ని ఆస్వాదించండి.

Related News