తిరుపతి నుండి రామేశ్వరం, మధురై, ఊటీ, అరుణాచలం, స్వర్ణ దేవాలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి AP పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం బస్సు ప్యాకేజీల ద్వారా జరిగేది. అయితే, ఇటువంటి దర్శన టిక్కెట్లు రద్దు కావడంతో ఆర్థికంగా నష్టపోయిన పర్యాటక అభివృద్ధి సంస్థ, ఇతర మార్గాల్లో తన బస్సులను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది.
తిరుపతి నుండి కోయంబత్తూర్, ఊటీ వయా చెన్నై
ఇందులో భాగంగా భక్తులు, పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు కొత్త ప్రత్యేక బస్సు ప్యాకేజీలను తీసుకువచ్చారు. ప్రతి బుధవారం తిరుపతి నుండి కోయంబత్తూర్‌కు ఒక బస్సు నడుస్తుంది. ఈ యాత్ర ఐదు రోజులు (5 రోజులు, 4 రాత్రులు) ఉంటుంది. దీనికి టికెట్ ధర పెద్దలకు రూ. 4210గా, పిల్లలకు రూ. 3370గా ఉంటుంది.
తిరుపతి నుండి మైసూర్, ఊటీ వయా బెంగళూరు
మరొక ప్యాకేజీలో భాగంగా ప్రతి బుధవారం తిరుపతి నుండి మైసూర్‌కు ఒక బస్సు నడుస్తుంది. ఈ పర్యటనకు టికెట్ ధర పెద్దలకు రూ. 3020గా, పిల్లలకు రూ. 2420గా ఉంటుంది. ఇది కూడా ఐదు రోజులు ఉంటుంది.
Related News
తిరుపతి- రామేశ్వరం- కన్యాకుమారి- మధురై- శ్రీరంగం- తిరుపతి వయా చెన్నై
మరో ప్యాకేజీ తిరుపతి నుండి శ్రీరంగం వరకు నాలుగు రోజులు (4 పగళ్లు, 3 రాత్రులు) అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. దీని టిక్కెట్ ధరలు పెద్దలకు రూ. 5600గా పిల్లలకు రూ. 4480గా ఉంటుంది.
నాల్గవ ప్యాకేజీ తిరుపతి నుండి ప్రారంభమై కాణిపాకం, అరుణాచలం, స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తిరుపతికి తిరిగి వస్తుంది. ఇది ఒక రోజు ప్యాకేజీ. ఇది ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. దీని టికెట్ ధర పెద్దలకు రూ. 1200 మాత్రమే. పిల్లలకు రూ. 960గా ఉంటుంది.
ఈ ప్యాకేజీలలో అల్పాహారం, భోజనం, వసతి కూడా ఉన్నాయి. ఇది కాకుండా మల్టీ-యాక్సిల్ AC వోల్వో బస్సులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి బస్సులో 40 సీట్లు ఉంటాయి. మరిన్ని వివరాలు, బుకింగ్‌ల కోసం మీరు APTDC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. టికెట్ ధరలు, ఇతర వివరాల కోసం పర్యాటక శాఖ అధికారులు 9848007024, 9848850099, 9848973985 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.