మీ జీతం తక్కువైనా ఖాతాను రూ. 3 కోట్లకు పెంచుకోవడం ఈజీ… ఈ ఒక్క పని చేస్తే చాలు…

మీరు కోటీశ్వరుడు కావాలని అనుకుంటున్నారా? కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేకపోతున్నారా? అప్పుడు SIP (Systematic Investment Plan) మీ కోసం బెస్ట్ ఆప్షన్.

కేవలం ₹2,000 నెలకి పెట్టుబడి పెడుతూ 10/35/12 ఫార్ములా ఫాలో అయితే, 35 ఏళ్లలో ₹3 కోట్లకు పైగా సంపాదించవచ్చు… ఎలా అంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 10/35/12 ఫార్ములా అంటే ఏంటి?

  • 10 = ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని 10% పెంచాలి.
  • 35 = 35 ఏళ్ల పాటు నిరంతరం ఇన్వెస్ట్ చేయాలి.
  • 12 = సగటు 12% రిటర్న్ లభిస్తుందని అంచనా.

ఈ విధంగా లాంగ్ టర్మ్ SIP కొనసాగిస్తే, ₹2,000 పెట్టుబడి ₹3 కోట్లకు పెరగొచ్చు.

₹2,000 SIP తో కోటీశ్వరుడు ఎలా కావచ్చు?

25 ఏళ్ల వయసులో SIP మొదలు పెడితే, ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతే మొత్తం రూ. 3 కోట్లు ఆర్జించవచ్చు.

Related News

  •  మొదటి సంవత్సరం – ₹2,000 నెలకు ఇన్వెస్ట్మెంట్.
  •  రెండో సంవత్సరం – SIP ₹2,200 (10% పెంపు).
  •  మూడో సంవత్సరం – SIP ₹2,420 (మళ్లీ 10% పెంపు).
  •  ఇలా 35 ఏళ్ల పాటు కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి ₹65,04,585 అవుతుంది.

ఇందులో మీ పెట్టుబడి కేవలం ₹65 లక్షలు మాత్రమే. మిగతా మొత్తం ₹2.50 కోట్లు వడ్డీ రూపంలో వస్తుంది. మీ ఖాతాలోకి వచ్చే మొత్తం ₹3,15,29,653 (₹3.15 కోట్లు).

ఇలా SIP లాభాలు అనేవి కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల మన పెట్టుబడి గుణిస్తూ పెరుగుతుంది. దాని ద్వారా లాభం పెరుగుతూ ఉంటుంది ఎంత ఎక్కువ కాలం మన పెట్టుబడి అలాగే ఉంటే మనకు లాభం ఎక్కువ మొత్తం వస్తుంది.

SIP మిస్సయితే 3 కోట్లు మిస్సయినట్టే

  •  తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం.
  •  లాంగ్ టర్మ్ SIP తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్.

లైఫ్ సెట్ చేసుకోవాలంటే, ఇప్పుడే SIP స్టార్ట్ చేయండి. నెలకు ₹2,000 కట్టలేకపోతే మీ భవిష్యత్తు కోటీశ్వరుడిగా మారే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే. SIP స్టార్ట్ చేయడానికి ఆలస్యం ఎందుకు? ఈ రోజు నుంచే మొదలు పెట్టండి.