₹0 పెట్టుబడికి ₹1,29,808 గ్రాట్యుటీ.. ఉద్యోగుల సేవలకు బెస్ట్ గిఫ్ట్?… నిజమేనా?…

ఉద్యోగం నుండి రిటైర్ అయినా, వదిలిపెట్టినా, కంపెనీ నుంచి ఒకేసారి లంప్‌సమ్‌గా వచ్చే డబ్బు పేరు గ్రాట్యుటీ. చాలామందికి తెలుసు – 5 ఏళ్లు పూర్తయిన తర్వాతే గ్రాట్యుటీ వస్తుందనేది. కానీ అసలు నిజం ఏంటంటే, కొన్ని పరిస్థితుల్లో 5 ఏళ్లు పూర్తకాకముందు కూడా గ్రాట్యుటీ పొందవచ్చు. ఇది తెలుసుకోకపోతే, లక్షల్లో నష్టం అయ్యే అవకాశముంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలియని నిజం ఏంటంటే, ఒక ఉద్యోగి 4 సంవత్సరాలు 240 రోజులు పని చేస్తే, అది 5 సంవత్సరాల సేవగా పరిగణించబడుతుంది. అంటే 4.8 సంవత్సరాలు పూర్తి అయిన వారూ గ్రాట్యుటీ కి అర్హులవుతారు. మీ కంపెనీ గ్రాట్యుటీ ఇవ్వడం లేదంటే, లేబర్ డిపార్ట్మెంట్ లేదా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి, ఉద్యోగం వదిలేటప్పుడు మీ సేవా కాలాన్ని ఖచ్చితంగా లెక్కించండి.

ఇంకొక ముఖ్యమైన విషయం – ఉద్యోగి మరణం లేదా డిసేబిలిటీ జరిగితే, 5 ఏళ్లు కూడా అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో ఉద్యోగి కుటుంబానికి గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే. కానీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే మాత్రం కొన్ని హైకోర్టులు తప్పనిసరిగా 5 సంవత్సరాలు పూర్తయ్యుండాలి అంటున్నాయి. ఢిల్లీ, మద్రాస్ హైకోర్టులు అయితే 4.8 సంవత్సరాలు సరిపోతుందన్నాయి. కానీ కర్ణాటక హైకోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇది వర్తిస్తుంది అని చెప్పింది.

Related News

ఇప్పుడు గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు అంటే, ఇది ఫార్ములా:

(15 x చివరి జీతం x సేవా కాలం) / 26

ఒక ఉదాహరణగా, ఒక ఉద్యోగి చివరి జీతం ₹45,000 అని అనుకుందాం. అతను 4 సంవత్సరాలు 290 రోజులు పని చేశాడు అంటే, అది 5 సంవత్సరాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు ఫార్ములా ప్రకారం:

(15 x ₹45,000 x 5) / 26 = ₹1,29,808

అంటే, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఉద్యోగి ₹1.29 లక్షల గ్రాచ్యుటీ పొందవచ్చు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ కానీ ₹20 లక్షల వరకు మాత్రమే ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కాబట్టి, మీరు ఉద్యోగం వదిలిపెట్టే ముందు మీ సేవా కాలం 4 సంవత్సరాలు 8 నెలలు అయినా ఉందా? అని ఖచ్చితంగా చెక్ చేయండి. లేదంటే, మీకు రావాల్సిన లక్షల్లో గ్రాచ్యుటీ డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది.