X Subscription: పెరిగిన ‘ఎక్స్’ సబ్‌స్క్రిప్షన్ ధరలు..!!

గ్లోబల్ బిలియనీర్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X సబ్‌స్క్రిప్షన్‌ల ధరలను భారీగా పెంచింది. ఇటీవల ఎలోన్ మస్క్ AI చాట్‌బాట్ XAI Grok3 సేవలను ప్రారంభించింది. ఈ మోడల్ విడుదలైన కొన్ని గంటల్లోనే X సబ్‌స్క్రిప్షన్‌ల ధరలు పెరగడం గమనార్హం. X సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు చేయడం ద్వారా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. సవరించిన ధరల ప్రకారం.. X ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 1,750 నుండి రూ. 3,470కి పెంచారు. వార్షిక ప్లాన్ ధరను కూడా రూ. 18,300 నుండి రూ. 34,430కి పెంచారు. అక్టోబర్ 2023లో, ఇది మొదటిసారిగా X ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ల ధరలను పెంచింది. ప్లాట్‌ఫామ్ ఆదాయాన్ని పెంచడానికి గత సంవత్సరం డిసెంబర్‌లో రూ. 1,300 ధరను రూ. 1,750కి సవరించారు. ఇటీవల దీనిని రెట్టింపు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే X ప్రస్తుతం బేసిక్, ప్రీమియం, ప్రీమియం ప్లస్ అనే మూడు ప్లాన్‌లను అందిస్తోంది. బేసిక్ ప్లాన్ ధర రూ. 244. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 650. AI చాట్‌బాట్ Grok3 సేవలను పొందడానికి సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని X స్పష్టం చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now