2024-25 ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టైంలో చాలామంది ట్యాక్స్ ఆదా చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ చాలా మందికి ఏ స్కీం ఎంచుకోవాలో క్లారిటీ ఉండదు. పాత ట్యాక్స్ విధానం (Old Regime)ను ఎంచుకున్నవారికి కొన్ని సూపర్ స్కీములు ఉన్నాయి. ఇవి ట్యాక్స్ మినహాయింపు కలిగించడమే కాకుండా భవిష్యత్‌కు భద్రతనూ ఇస్తాయి.
ప్రస్తుతం మీరు PPF, NPS, SSY, ELSS, SCSS వంటి ప్రభుత్వ స్కీముల్లో పెట్టుబడి పెడితే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ₹1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. కొన్ని స్కీముల్లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు కూడా లభిస్తుంది.
ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం)
ఇది ఒక మ్యూచువల్ ఫండ్ ఆధారిత స్కీం. లాక్-ఇన్ పీరియడ్: 3 సంవత్సరాలు,ట్యాక్స్ మినహాయింపు: ₹1.5 లక్షల వరకు,లాభాలపై పన్ను: ₹1 లక్ష వరకు ట్యాక్స్ లేదు
Related News
PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)
భద్రమైన పొదుపు కోసం ఎక్కువమంది ఈ స్కీం ఎంచుకుంటారు. వడ్డీ రేటు: 7.1% వరకు,లాక్-ఇన్ పీరియడ్: 15 సంవత్సరాలు,ట్యాక్స్ మినహాయింపు: ₹1.5 లక్షలు (EEE Category)
SSY (సుకన్య సమృద్ధి యోజన)
ఇది కూతురి భవిష్యత్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అర్హత: కూతురు వయస్సు 10 ఏళ్ల లోపు ఉండాలి,వడ్డీ రేటు: 8.2%,లాక్-ఇన్: 21 ఏళ్ల వరకు లేదా పెళ్లి వరకు,ట్యాక్స్ మినహాయింపు: ₹1.5 లక్షలు
NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్)
రిటైర్మెంట్ ఆదాయం కోసం మంచి ఎంపిక. అర్హత: 18 నుండి 65 ఏళ్ల మధ్య వయస్సు,కనీస పెట్టుబడి: ₹1,000,ట్యాక్స్ మినహాయింపు: ₹1.5 లక్షలు (సెక్షన్ 80C),అదనంగా ₹50,000 వరకు సెక్షన్ 80CCD(1B) కింద మినహాయింపు
ముఖ్యమైన విషయం
ఈ స్కీముల్లో పెట్టుబడి చేసి టాక్స్ మినహాయింపు పొందడానికి గడువు ముగుస్తోంది. ఇప్పుడు పెట్టుబడి చేస్తేనే ఈ ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ మినహాయింపు పొందగలరు. ₹1.5 లక్షలు పెట్టుబడి పెడితే, ట్యాక్స్ ఆదా అవ్వడం మాత్రమే కాకుండా, భవిష్యత్‌కు భద్రతా వృద్ధి కూడా కలుగుతుంది.
ఈ అవకాశాన్ని మిస్ అవకండి. ట్యాక్స్ మినహాయింపుతో పాటు మంచి రాబడి పొందే ఈ ప్రభుత్వ స్కీముల్లో ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.