Gold: భయం సందేహం వద్దు… ఇలా ఈజీగా బంగారం నాణ్యత చెక్ చేయండి…

బంగారం అంటే తెలుగువారికి ఇష్టం ఒక్కటే కాదు, ఓ ఆస్తి అని భావించే సంప్రదాయం. కానీ బంగారం అసలు ఉందా? మోసం జరుగుతుందా? అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. మార్కెట్లో మూడు రకాల కేరట్ బంగారం లభిస్తుండటంతో, ఏది నిజమైనది? ఏది కలిపినదో? తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ ఇంట్లోనే చిన్న చిన్న పద్ధతులతో బంగారం శుద్ధతను ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బంగారం రకాలు – ఏది ఏంటో తెలుసుకోండి

మార్కెట్‌లో ఎక్కువగా 18 కేరట్, 22 కేరట్, 24 కేరట్ బంగారం మాత్రమే అమ్ముతున్నారు. వీటిలో 24 కేరట్ బంగారం శుద్ధమైన బంగారంగా పరిగణిస్తారు. ఇది 99.9 శాతం బంగారం కలిగి ఉంటుంది. కానీ చాలా మృదువుగా ఉండడం వల్ల ఇది ఆభరణాల తయారీలో వాడలేరు.

అందుకే ఆభరణాల కోసం ఎక్కువగా 22 కేరట్ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇది దాదాపు 91 శాతం బంగారం కలిగి ఉంటుంది. మిగతా భాగం ఇతర లోహాలతో మిశ్రమం ఉంటుంది.

హాల్‌మార్క్ ఉన్నదా? ఎప్పటికప్పుడు చెక్ చేయండి

బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్ ఉందా లేదా చూసుకోవడం చాలా అవసరం. హాల్‌మార్క్ అనేది ప్రభుత్వం ప్రామాణికత ఇచ్చిన గుర్తింపు. హాల్‌మార్క్ ఉన్న ఆభరణం అంటే అది నిర్దిష్ట శుద్ధత కలిగిన బంగారం అని అర్థం. ప్రతి పీసులోనే కేరట్ నంబర్ ఉంటుంది.

ఉదాహరణకు – 22K916 అని రాసి ఉంటే, అది 22 కేరట్ బంగారం అని అర్థం. కనుక, బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్ మరియు కేరట్ నంబర్ ఉండేలా చూసుకోండి.

వినిగర్‌తో ఇంట్లోనే పరీక్ష – నిజమెంటే తేలిపోతుంది

మీ దగ్గర బంగారం ఉన్నా అది నిజమా? నకలా? అన్న డౌట్ వస్తే ఇంట్లోనే ఒక చిన్న పరీక్ష చేయండి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో బంగారం పెట్టండి లేదా బంగారం మీద కొన్ని చుక్కలు వేయండి. శుద్ధమైన బంగారానికి రంగు మారదు. కానీ నకిలీ బంగారానికి రంగు మారుతుంది. రంగు మారితే అది కలిసిన బంగారం అని అర్థం.

మ్యాగ్నెట్ టెస్ట్ – ఆకర్షితమైతే జాగ్రత్త

ఇంకా ఒక సింపుల్ టెస్ట్ – మ్యాగ్నెట్ టెస్ట్. ఒక మామూలు మాగ్నెట్ తీసుకుని బంగారాన్ని దానివద్ద ఉంచండి. బంగారం మాగ్నెట్‌కి ఆకర్షితమైతే అది నకిలీ. ఎందుకంటే నిజమైన బంగారం ఎప్పుడూ మాగ్నెట్‌కి ఆకర్షితమవదు. ఇది ఒక చక్కటి పరీక్ష పద్ధతి.

మెషీన్ టెస్ట్ – జ్యువెల్లరీ షాప్‌లోనే చెక్ చేయించుకోండి

సహజంగా చాలా జ్యువెల్లరీ షాపుల్లో బంగారం క్వాలిటీ చెక్ చేసే మెషీన్ ఉంటుంది. దానివద్ద మీ బంగారం పెట్టి ఎన్ని కేరట్లు ఉందో తెలుసుకోవచ్చు. ఇది శుద్ధత పరీక్షలో అత్యంత ఖచ్చితమైన పద్ధతి. మీరు పాత ఆభరణాలను విక్రయించేముందు లేదా గదిలో పెట్టేముందు తప్పకుండా ఈ మెషీన్ ద్వారా టెస్ట్ చేయించుకోవాలి.

బంగారం ధరలు మళ్లీ ఆకాశం తాకేలా ఉన్నాయి

ఇప్పటికే 24 కేరట్ బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ.70 వేల దాటి ఉంది. అమెరికాలో ట్రంప్‌ టారిఫ్‌ నిషేధం తర్వాత కూడా బంగారం ధరలు పడిపోకుండా ఉండటం విశేషం.

నిపుణుల మాటల ప్రకారం, ఇదే పెరుగుదల కొనసాగితే త్వరలోనే బంగారం ధర రూ.1 లక్షకు చేరే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు మీరు కొనుగోలు చేయాలనుకుంటే బంగారం ఖచ్చితంగా శుద్ధమైనదేనా అని పూర్తిగా ధృవీకరించుకుని కొనండి.

మీ కష్టానికి ఆదాయంగా వచ్చే బంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీగా ఉండకూడదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో కూడా బంగారం నకిలీదా అసలిదా అన్న విషయం తేల్చేయొచ్చు.

హాల్‌మార్క్ చూసి, వినిగర్ టెస్ట్ చేసి, మాగ్నెట్ టెస్ట్ చేసి, కావాలంటే మెషీన్ టెస్ట్ కూడా చేయించండి. ఒక్కసారి మోసపోతే మీ ఖరీదైన పెట్టుబడి అర్థం లేకుండా పోతుంది.

కనుక కొనుగోలు చేసే ప్రతీసారి ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి… బంగారం లో బంగారం ఉండాలని చూసుకోండి…