తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశం సంచలనంగా మారింది. ఈ విషయంలో కొంతమంది తెలుగు సినీ తారలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. ఆర్జీవీ కొత్త సినిమా ‘సారీ’ నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తోంది. వర్మ కథ రాశారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవివర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో బెట్టింగ్ యాప్‌ల గురించి మాట్లాడుతూ.. RGV మాట్లాడుతూ.. “నాకు బెట్టింగ్ యాప్‌ల గురించి తెలియదు. నేను ఎప్పుడూ ప్రకటనలలో నటించలేదు, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రమోషన్‌లు చేయలేదు. నేను ప్రచారం చేయాల్సి వస్తే, నేను వోడ్కా ప్రమోషన్ చేస్తాను. బెట్టింగ్ యాప్‌లను కాదు. సామాన్యుడికి ఏవి చట్టబద్ధమైనవో, ఏవి కాదో తెలియదు. ప్రభుత్వం దీని గురించి అవగాహన కల్పించాలి. స్టార్లు బెట్టింగ్ యాప్‌లు కాకుండా ఇతర బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేయాలి. అవి చట్టబద్ధమైనవో కాదో మీకు ఎలా తెలుస్తుంది? ఇది ఒకేసారి నేరం అని చెప్పే బదులు, ప్రభుత్వం మొదట ఏవి చట్టబద్ధమైనవో స్పష్టం చేయాలి. ”