Alchol: మద్యం సేవిస్తున్నప్పుడు.. వీటిని తింటే ఇక అంతే సంగతి..!!

కొందరు మద్యం సేవించేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తింటారు. సాధారణంగా తాగేటప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు కనిపిస్తే, తెలియకుండానే వాటిని తింటారు. కానీ, మద్యం కలిపి ఏదైనా తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అది తిన్న తర్వాత, కొంతమందికి వెంటనే వాంతులు అవుతాయి. అలాంటి వారు ఈ ఆహారాలను ఆల్కహాల్ తో తినకూడదని అంటున్నారు. ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నూనె పదార్థాలు
మద్యం వల్ల ఆమ్లత్వం వస్తుంది. మద్యం సేవించిన తర్వాత రాత్రి భోజనంలో నూనె పదార్థాలు తినకండి. అలాంటి సమయంలో జీర్ణం కావాలంటే మీరు తినే ఆహారం తేలికగా ఉండేలా చూసుకోవాలి. అందుకే తాగిన తర్వాత బిర్యానీ తినకపోవడమే మంచిది.

పాల ఉత్పత్తులు
మద్యం సేవించేటప్పుడు పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. జున్ను, వెన్న, పాలు మొదలైనవి జీర్ణం కావడం చాలా కష్టం. వీటిని తినడం వల్ల అజీర్ణం, కడుపు మంట వస్తుంది. చీజ్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను తీసుకోకండి.

Related News

 

స్పైసీ ఫుడ్స్
తాగేటప్పుడు ప్రజలు కారంగా ఉండే ఆహారాన్ని తింటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని చెబుతారు. అలాగే, ఈ సమయంలో బంగాళాదుంప చిప్స్‌కు దూరంగా ఉండాలి. ఉప్పు ఉన్న ఆహారాలు దాహాన్ని పెంచుతాయి.

 

స్వీట్లు
మద్యం తాగేటప్పుడు చాక్లెట్లు వంటి తీపి పదార్థాలు తీసుకుంటే, అది మత్తును కలిగిస్తుంది. ఆ తర్వాత, అది మిమ్మల్ని ఎక్కువగా తాగేలా చేస్తుంద . మిమ్మల్ని కిందపడేలా చేస్తుంది. కాబట్టి, మీరు అస్సలు స్వీట్లు తినకూడదు.