TMC అంటే ఏమిటి?.. ఒక TMC నీరు ఎన్ని లీటర్లకు సమానం?

‘టీఎంసీ’ అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో డ్యాంలు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. నదుల్లో నీటి మట్టం కొలవటానికి సాధారణం గా వాడే పదం TMC

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఒక్కో రిజర్వాయర్‌లో రెండు నుంచి మూడు టీఎంసీల వరకు నీరు చేరిందని నీటి ఉదృతి ఎక్కువగా ఉందని కిందకి నీరు వదిలారు అని వింటూ ఉంటాం . ఇక్కడే చాలా మందికి ఒక సందేహం. TMC అంటే ఏమిటి?

TMC, Unit Used To Measure Volume Of Water In Dams,

TMC  అంటే వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు. అంటే వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు. అంటే దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఒక్క అడుగు నీరు నిలిచిపోతే అది 1 టీఎంసీకి సమానమని కూడా చెప్పవచ్చు. టీఎంసీ పూర్తి రూపం వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు. దీనిని TMC లేదా Tmc ft లేదా Tmcft అని కూడా సూచిస్తారు. ఇది భారతదేశంలోని ఆనకట్టలు లేదా రిజర్వాయర్లలోని నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్.

ఒక TMC అంటే దాదాపు 2,881 కోట్ల లీటర్లు (క్యూబిక్ ఫీట్లు). 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు నీరు చేరితే అది ఒక TMC నీటికి సమానంగా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.