చుండ్రు చాలా సాధారణ సమస్య. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు వల్ల తలపై తెల్లటి పొరలు ఏర్పడతాయి. ఇది దురద, జుట్టు రాలడానికి దారితీస్తుంది. చుండ్రును తొలగించడానికి మార్కెట్లో అనేక రకాల షాంపూలు, సీరమ్‌లు, నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయోజనాలతో పాటు, వీటికి కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కానీ, చుండ్రును సహజ మార్గాల్లో కూడా నియంత్రించవచ్చని మీకు తెలుసా? చుండ్రు ఎందుకు వస్తుంది? ఈ సమస్యను ఎలా నియంత్రించాలి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చుండ్రు కారణాలు..
పొడి నెత్తి, తీవ్రమైన ఒత్తిడి, జిడ్డుగల చర్మంపై దుమ్ము పేరుకుపోవడం, జుట్టును తరచుగా కడగడం లేదా అస్సలు శుభ్రం చేయకపోవడం. చుండ్రు తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్, రసాయన ఉత్పత్తుల అధిక వినియోగం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందులు తీసుకోవడం వంటి కారణాల వల్ల వస్తుంది. కానీ చుండ్రును అదుపులో ఉంచడానికి అనుసరించాల్సిన కొన్ని సహజ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Related News
1. కొబ్బరి నూనె, నిమ్మకాయ
రెండు చెంచాల కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో నిమ్మరసంతో కలిపి తలకు రాయండి. కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, మీ జుట్టును షాంపూతో బాగా కడగాలి. ఇది చుండ్రును తొలగించడమే కాకుండా తలకు తేమను కూడా అందిస్తుంది.
2. పెరుగు
పెరుగు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా మంచిది. చుండ్రును త్వరగా తగ్గించడానికి ఇది ఒక సహజ మార్గం. పెరుగును తలకు బాగా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఇది తలకు తేమను అందిస్తుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
3. వేప రసం
వేపలోని ఔషధ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులను మెత్తగా రుబ్బి, రసాన్ని తీసి తలకు అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి చుండ్రు తగ్గుతుంది.
4. నారింజ తొక్క, నిమ్మరసం
నారింజ తొక్కను రుబ్బి, దానికి కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గుతుంది.
5. గ్రీన్ టీ
గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తలకు పట్టించినప్పుడు చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 2 గ్రీన్ టీ బ్యాగులను వేడి నీటిలో నానబెట్టి, ఆ నీటిని చల్లబరిచి తలకు అప్లై చేస్తే చుండ్రు తగ్గుతుంది. కొంత సమయం తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గుతుంది.