కేవలం ₹25,000 పెట్టుబడి… రోజుకి ₹3,000 ఆదాయం… కూల్ బిజినెస్ ఐడియా..

ఎండలు మొదలవగానే చల్లటి డ్రింకుల కోసం డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇదే అవకాశాన్ని గమనించిన మణీష్ గుప్తా, వారణాసి నుంచి రాయపూర్‌కు వచ్చి అక్కడ మామిడి పన్నా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ‘ఆరోహి జల్జిరా సెంటర్’ అనే పేరుతో మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో చిన్న షాప్ నడుపుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మామిడి పన్నా ఒక్కటే కాకుండా నిమ్మకాయ జ్యూస్, బేల్ జ్యూస్, లస్సీ, సత్తూ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో మామిడి పన్నాకే ఎక్కువ డిమాండ్ ఉంది.

మణీష్‌ తయారు చేసే మామిడి పన్నాలో ఓ ప్రత్యేకత ఉంది. ఫ్రెష్ మామిడి పండ్లను తీసుకుని వాటిని ఉడకబెట్టి, గుజ్జును తీసి అందులో పుదీన, జల్జిరా, వేపిన జీలకర్ర, నల్ల ఉప్పు, చెక్కెరతో పాటు ఆయన తయారు చేసే ప్రత్యేక మసాలాలు కలిపి చేస్తారు.

Related News

టేస్ట్ గ్లాస్

కస్టమర్‌కి ముందుగా చిన్న టేస్ట్ గ్లాస్ ఇస్తారు. నచ్చితే ఫుల్ గ్లాస్ అందిస్తారు. ఆయన చెబుతారు – ఇది రెండు సంవత్సరాలుగా చేస్తున్న పని. శ్రద్ధగా చేస్తే ఏ పని చిన్నది కాదు.

₹3,000‌ సంపాదన

ఈ చిన్న బిజినెస్‌ నుండే మణీష్ రోజుకు సుమారు ₹3,000 సంపాదిస్తున్నారు. పెద్దగా ఖర్చులు లేకుండానే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎవరికైనా బండిమీద వ్యాపారం చేసే ప్లాన్ ఉంటే కేవలం ₹35,000తో ఈ బిజినెస్‌ స్టార్ట్ చేయొచ్చు. బండి రెంట్ తీసుకుంటే రూ.25,000 చాలు. వేసవిలో మామిడి పన్నా డిమాండ్ బాగా పెరగడంతో మంచి లాభాలు వస్తాయి. అక్కడికి వచ్చే చాలామంది కస్టమర్లు మణీష్‌ మామిడి పన్నాకే ఫ్యాన్స్ అయ్యారు.

మణీష్ ప్రకారం – తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఆరోగ్యకరమైన డ్రింక్‌లను అందిస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. వేసవిలో కూల్‌డ్రింక్‌లకు బదులుగా నేచురల్‌, హెల్తీ ఆప్షన్‌ కావాలనుకునేవాళ్లకు మామిడి పన్నా అద్భుతం.

అలాగే, ఈ వ్యాపారం కేవలం లాభం మాత్రమే కాదు, ఇతరులకు కూడా స్పూర్తిగా ఇస్తోంది. మణీష్ లాంటి యువ పారిశ్రామికవేత్తలు ఈ తరహా స్మాల్ బిజినెస్‌లతో తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాపార అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది.