తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ గా మారితే దానికి Remaal అని పేరు పెట్టారు.
ఆదివారం రాత్రి తీవ్ర తుపానుగా Bangladesh and West Benga మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఈ క్రమంలో కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రధాన హెచ్చరిక నంబర్ను జారీ చేసింది.
ప్రస్తుతం తీవ్ర వాయు వ్యవస్థ ఈశాన్య దిశగా కదులుతున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని.. వాటి ప్రభావంతో కోస్తా వెంబడి వాతావరణం చల్లబడిందని వెల్లడించారు.
Related News
రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. రెండు రోజుల్లో APలో తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడు, రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు.
ఈదురు గాలుల కారణంగా Kakinada district Uppada లో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సుబ్బంపేట నుంచి SPGL వరకు అలలు ఎగసిపడుతున్నాయి.
రాకాసి అలల ప్రభావంతో beach road పై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలలు వాహనదారులపైకి దూసుకుపోతున్నాయి.
ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతోపాటు సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. సెల్ఫీల సందడిలో సముద్రం అలలతో యువత అల్లరి చేస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.