చిన్న పెట్టుబడి.. జీవితాంతం కచ్చితమైన పెన్షన్.. ఇప్పుడే ఈ స్కీం లో చేరండి…

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఇప్పటివరకు NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్) కింద ఉన్న ఉద్యోగులు ఇప్పుడు కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ని ఎంచుకోవడానికి ఛాన్స్ వచ్చింది. ప్రభుత్వం మార్చి 19, 2025న UPS సంబంధిత నిబంధనలను ప్రకటించగా, ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. అయితే UPS కు అప్లై చేయడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. టైం మిస్ అయితే మళ్లీ ఛాన్స్ ఉండదు.

UPS అంటే ఏమిటి?

  • UPS (Unified Pension Scheme) – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం PFRDA (Pension Fund Regulatory and Development Authority) కొత్తగా తీసుకురాబోతున్న పెన్షన్ ప్లాన్.
  • ఇది ప్రస్తుతం NPSలో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుంది.
  • NPS ఎంపిక చేసుకున్న ఉద్యోగి మృతిచెందితే, అతని భార్య కూడా UPSని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది.

UPS నిబంధనల్లో స్పెషల్ విషయాలు

  • పెన్షన్ చెల్లింపుల (Payout) విధానం, ఫ్యామిలీ బెనిఫిట్స్, డిఫాల్ట్ పెటర్న్ లాంటి విషయాలు ఇందులో వివరంగా పొందుపరిచారు.
  • PFRDA మార్గదర్శకాలను పాటిస్తూ, ఉద్యోగుల రికార్డులు సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.

ఎవరికి UPS ఎంపిక చేసే అవకాశం ఉంటుంది?

  • ఇప్పటికే NPSలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులు UPSకి మారవచ్చు.
  • ఏప్రిల్ 1, 2025 తర్వాత ఉద్యోగంలో చేరే వారు కూడా 30 రోజుల్లో UPS/NPS ఎంపిక చేసుకోవాలి.
  • NPS ఎంపిక చేసుకున్న రిటైర్డ్ ఉద్యోగి మరణిస్తే, అతని భార్య UPSకు అప్లై చేసుకోవచ్చు.

UPSకి ఎలా అప్లై చేయాలి?

  1.  ఏప్రిల్ 1, 2025 నుంచి 3 నెలలలోపు అప్లై చేయాలి
  2.  కొత్తగా ఉద్యోగంలో చేరేవారు 30 రోజుల్లోపు అప్లై చేయాలి
  3.  ప్రభుత్వం కావాలనుకుంటే ఈ గడువును పెంచే అవకాశం ఉంది
  4.  ఒకసారి UPSకి మారితే, తిరిగి మార్చుకునే ఛాన్స్ ఉండదు

UPS అప్లై చేసే విధానం

  • ప్రస్తుత ఉద్యోగులు – Form A2
  • కొత్తగా ఉద్యోగంలో చేరేవారు – Form A1
  • NPS రిటైర్డ్ ఉద్యోగులు – Form B2
  • NPS ఎంపిక చేసుకున్న ఉద్యోగి భార్య (అతని మరణం తర్వాత) – Form B6

ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ అప్లికేషన్

  •  ఆన్‌లైన్ – CRA పోర్టల్ ద్వారా అప్లై చేయవచ్చు
  •  ఆఫ్‌లైన్ – సంబంధిత శాఖా కార్యాలయం లేదా DDO (Drawing and Disbursing Officer) ద్వారా అప్లై చేయవచ్చు

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది?

నిర్ధారిత గడువులోపు అప్లై చేయకపోతే, మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా NPSలోనే కొనసాగుతుంది. UPS బెనిఫిట్స్ పొందలేరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అందుకే ఈ అవకాశం మిస్ అవ్వకండి.. జీతం నుండి చిన్న మొత్తం పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పెన్షన్ వస్తుంది.