పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లాంగ్‌టర్మ్ పొదుపు కోసం మంచి ఎంపిక. ఇది సురక్షితమైన పెట్టుబడి, గ్యారంటీ రాబడితో పాటు పన్ను మినహాయింపు (80C కింద ₹1.5 లక్షల వరకు) కూడా ఇస్తుంది. 15 ఏళ్ల లాక్-ఇన్ తర్వాత 5 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది.
PPF ఖాతా ఎవరు తెరవొచ్చు?
- ఉద్యోగులు, వ్యాపారులు, పెన్షన్ పొందేవారు – అందరూ తెరవొచ్చు.
- మైనర్ పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా కస్టోడియన్లు ఖాతా తెరవొచ్చు.
- దేశవ్యాప్తంగా ఒకే PPF ఖాతా మాత్రమే ఉండాలి.
PPF ఖాతా ఎక్కడ తెరవాలి?
బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ – రెండింటిలో ఏదైనా ఒకదానిలో తెరవవచ్చు. రూల్స్, బెనిఫిట్స్ రెండింటిలోనూ ఒకేలా ఉంటాయి.
PPFలో డబ్బు ఎంత పెడితే ఎంత వస్తుంది?
PPF వడ్డీ రేటు ప్రస్తుతం 7.1% ఉంది. ఇప్పుడు 20 ఏళ్లలో రూ. 3,000, రూ. 7,000, రూ. 11,000 నెలకు పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో చూద్దాం!
Related News
రూ. 3,000 నెలకు (రూ. 36,000 సంవత్సరం)
- 20 ఏళ్ల మొత్తం పెట్టుబడి: ₹7,20,000
- అందుకునే వడ్డీ: ₹8,77,989
- మొత్తం మేచ్యురిటీ అమౌంట్: ₹15,97,989
రూ. 7,000 నెలకు (రూ. 84,000 సంవత్సరం)
- 20 ఏళ్ల మొత్తం పెట్టుబడి: ₹16,80,000
- అందుకునే వడ్డీ: ₹20,48,641
- మొత్తం మేచ్యురిటీ అమౌంట్: ₹37,28,641
రూ. 11,000 నెలకు (రూ. 1,32,000 సంవత్సరం)
- 20 ఏళ్ల మొత్తం పెట్టుబడి: ₹26,40,000
- అందుకునే వడ్డీ: ₹32,19,294
- మొత్తం మేచ్యురిటీ అమౌంట్: ₹58,59,294
PPF ఎందుకు ఉపయోగపడుతుంది?
- రిస్క్-ఫ్రీ పెట్టుబడి – మీ డబ్బు ఎప్పటికీ నష్టపోయే ఛాన్స్ లేదు.
- పన్ను మినహాయింపు – ఇన్వెస్ట్‌మెంట్ + వడ్డీ + మేచ్యురిటీ మొత్తం పన్ను రహితం
- భవిష్యత్తుకు ఖచ్చితమైన పొదుపు – రిటైర్మెంట్, పిల్లల విద్య కోసం బెస్ట్ ప్లాన్.
మేచ్యురిటీ తర్వాత మీకు మూడు ఆప్షన్లు:
- పూర్తిగా విత్‌డ్రా చేయొచ్చు.
- అదే ఖాతాలో వడ్డీ వచ్చేట్టు ఉంచుకోవచ్చు.
- 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు.
ఈ గ్యారంటీ స్కీమ్‌ను మిస్ అవకండి. మీ భవిష్యత్తు సురక్షితం చేసుకోడానికి ఇప్పుడే PPF ఖాతా ఓపెన్ చేయండి.