మారుతున్న సాంకేతికతతో automobiles లో కూడా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అన్ని కంపెనీలు తమ వాహనాల్లో కొత్త ఫీచర్లను ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన విప్లవాల్లో self-driving cars గురించి అందరికీ తెలిసిందే. భారతదేశంలో కూడా self-driving technology తో కూడిన కొన్ని కార్లు ఉన్నాయి. అయితే self-driving two-wheeler గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ద్విచక్రవాహనం విషయంలో ఇలాంటి ఆలోచనే వచ్చేది కాదు. కానీ, ఓలా కంపెనీకి అలాంటి ఆలోచన వచ్చింది. అందుకే Ola Solo project చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది.
సాధారణంగా, self-driving bike ను ఎవరూ నమ్మరు. ఓలా కంపెనీ తన ఓలా సోలోను ఏప్రిల్ 1న ప్రకటించింది. ఓలా కూడా యూజర్లను ఫూల్స్ చేసేందుకే ఇలాంటి చిలిపి పని చేసిందని అందరూ అనుకున్నారు. అయితే, ఓలా వ్యవస్థాపకుడు, భవానీష్ అగర్వాల్, తన self-balancing, , స్వయంప్రతిపత్త ద్విచక్ర వాహన వివరాలను మరోసారి వెల్లడించారు. Ola Solo project సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. భవ్నీష్ పోస్ట్ చేసిన వీడియోలో Ola electric bike తనంతట తానుగా ముందుకు కదులుతోంది. కిందపడకుండా నేరుగా వెళ్లడమే కాకుండా.. పక్కకు కూడా తిరుగుతోంది. ఆగిపోయినా పక్కకు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈ వీడియోను మరోసారి పోస్ట్ చేస్తూ.. సరదాగా తీసిన వీడియో. అయితే తమ ప్రాజెక్ట్ నిజమేనని చెప్పారు.
ఓలా బృందం తాము Atanus, a self-balancing two-wheeler. పని చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన నమూనాను కూడా సిద్ధం చేశారు. భవిష్యత్తులో తమ నుంచి వచ్చే ఉత్పత్తుల్లో ఈ టెక్నాలజీని చూసే అవకాశం ఉంటుందని భవానీష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ technology పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అమలైతే ఓలాను ఎవరూ ముట్టుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే కొంతమంది ఈ technology గురించి మాట్లాడుతున్నారు. అలాంటి self-balancing bike వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం ఉన్న బైక్ల నాణ్యతపై దృష్టి పెట్టాలని మరికొందరు సూచిస్తున్నారు.