యూపీఐ పేమెంట్స్ రాకతో క్యాష్ లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. చిన్న దుకాణాల నుంచి కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న బిజినెస్ వరకు అందరూ ఇప్పుడు యూపీఐనే ఉపయోగిస్తున్నారు. కొంతమంది కేవలం ఒక రూపాయి చెల్లించడానికి కూడా యూపీఐనే ఎంచుకుంటున్నారు.
కానీ, యూపీఐ ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. బుధవారం రాత్రి 7 గంటల నుంచి యూపీఐ పేమెంట్ సిస్టమ్ లో ఇబ్బంది ఏర్పడింది. బ్యాంక్ సర్వర్లు రెస్పాండ్ చేయకపోవడంతో లక్షల మంది యూజర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దాదాపు ఒక గంటపాటు ఈ సమస్య కొనసాగింది, తర్వాత సరిగా పనిచేయడం మొదలైంది.
ఈ సమయంలో చాలా మందికి వివిధ సమస్యలు ఎదురయ్యాయి. హైదరాబాద్ నివాసి ఒకరు తన స్నేహితులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. 400 రూపాయల బిల్లు వచ్చిన తర్వాత, యూపీఐ ద్వారా చెల్లించాలనుకున్నారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా పేమెంట్ విజయవంతం కాలేదు. బ్యాంక్ అకౌంట్ లోనూ, జేబులోనూ డబ్బులు లేకపోవడంతో, అతను తన స్నేహితుల నుండి కూడా డబ్బులులేవని గ్రహించారు. చివరికి, షాప్ ఓనర్ దగ్గర తన మొబైల్ ఫోన్ ను తన దగ్గర పెట్టేసుకున్నారు , “డబ్బు చెల్లించిన తర్వాతే ఫోన్ తీసుకెళ్లండి ” అని చెప్పేసరికి పరిస్థితి వచ్చింది!
ఇలాంటి సందర్భాలలో, సామాన్యంగా ఇష్యూ లేకపోవచ్చు. కానీ, ఫుడ్ తిన్న తర్వాత, జేబులో డబ్బులు లేకుండా యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయితే, నిజంగా ఇబ్బంది ఎదురవుతుంది. ఆ రోజు దాదాపు ఒక గంటపాటు యూపీఐ సర్వీసెస్ డౌన్ అయ్యాయి, తర్వాత సమస్య పరిష్కారమైంది