UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగదారుల కోసం NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు యూఎపిఐ లావాదేవీల భద్రతను పెంచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
వాటిలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీరు 90 రోజుల పాటు మీ మొబైల్ నెంబర్ ఉపయోగించకపోతే, మీ టెలికం ప్రొవైడర్ ఆ నెంబరును ఇంకొకరికీ కేటాయించవచ్చు. అంటే, మీరు పాత మొబైల్ నెంబర్ ని ఉపయోగించి UPI లింక్ చేసినట్లయితే, ఆ నెంబర్ డీ-యాక్టివేట్ అయితే, మీ UPI ID కూడా ఆమలులో ఉండదు. ఇలా జరిగితే, మీరు UPI సేవలను వాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను నివారించడానికి, మీరు మీ బ్యాంకు ఖాతాతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మీరు తీసుకోవాల్సిన చర్యలు
- మొబైల్ నెంబర్ రివోకేషన్ లిస్ట్ (MNRL)
ఈ కొత్త మార్గదర్శకాలలో, MNRL అనే ఒక నూతన లిస్ట్ ఉంటుంది. ఇందులో UPI లావాదేవీలకు అర్హత లేని మొబైల్ నెంబర్లు చేర్చబడతాయి. మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ UPI కోసం అర్హత లేనట్లైతే, అది ఈ లిస్ట్‌లో చేర్చబడుతుంది. - డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (DIP)
బ్యాంకులు మరియు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ (PSPs) తమ డేటాను భద్రంగా, సరిగ్గా నిర్వహించేందుకు ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వారు తమ డేటాను భద్రంగా, అప్డేట్ చేసి పెట్టుకోవచ్చు. - డేటా అప్డేట్
బ్యాంకులు మరియు PSPs తమ డేటాను ప్రతివారం అప్డేట్ చేయాలని సూచన ఉంది. ఈ విధంగా, ప్రతి అప్డేట్ తో సమాచారం సరిగ్గా, భద్రంగా ఉంటుంది.
UPI వినియోగదారులకు సూచనలు
మీ మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతాతో అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. మీరు మొబైల్ నెంబర్ మార్చితే, వెంటనే మీ బ్యాంకుతో కొత్త నెంబర్ రిజిస్టర్ చేయండి. మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన నెంబర్నే ఉపయోగించండి. ఈ విధంగా, UPI సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా వాడవచ్చు.
UPI కొత్త ఫీచర్లు మరియు భద్రతా మార్పులు
అంతేకాకుండా, NPCI ఇటీవల UPI సెక్యూరిటీని పెంచేందుకు కొన్ని మార్పులు చేసింది. వాటిలో ఒక ముఖ్యమైన మార్పు “కలెక్ట్ పేమెంట్” ఫీచర్ పరిమితిని ప్రమాణీకరించిన పెద్ద వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంచడం. మిగతా వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు.
మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, “కలెక్ట్ రిక్వెస్ట్” పరిమితి పర్సనల్ లావాదేవీలలో రూ. 2,000కి పెరిగింది. ఇదీ, UPI యొక్క భద్రత కోసం తీసుకున్న మరో ఆలోచన. ఈ మార్పులు UPI సేవలను మరింత భద్రంగా, సురక్షితంగా మార్చనున్నాయి.