గూగుల్ లో ఈ 6 పదాలు టైప్ చేస్తే.. ప్రమాదంలో పడినట్టే!

Googleలో ఈ ఆరు పదాలను టైప్ చేయవద్దు: మీరు ప్రతిరోజూ మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ఫోన్‌లో ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేస్తున్నారా? అయితే, బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ఇంటర్నెట్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గూగుల్ లో ‘ఈ ఆరు పదాలు’ కలిపి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీ డివైజ్ లోని వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించింది. నిత్యం ఇంటర్నెట్‌ను వినియోగించే వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

ఇంతకీ ఆ ఆరు పదాలు ఏమిటి? గూగుల్‌లో ఏ పదాలను కలిపి టైప్ చేస్తే మీ డివైజ్ హ్యాక్ అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

 ఆ పదాలు ఏమిటి? 

ఇటీవలి కాలంలో హ్యాకర్లు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హ్యాకర్ల బెడద బాగా పెరిగింది. ఇంటర్నెట్ ఉపయోగించే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బెదిరింపులకు గురవుతున్నారు. వారి వ్యక్తిగత డేటాతో పాటు డబ్బును దొంగిలిస్తున్నారు.

‘Are Bengal Cats legal in Australia?’ –సేమ్​ ఇదే విధంగా (కొంచెం కూడా మార్పు లేకుండా) అంటే ఉన్నది ఉన్నట్టుగా గూగుల్​లో టైప్​ చేయడం లేదా సెర్చ్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది సొఫోస్.

ముఖ్యంగా ‘‘Are Bengal Cats legal in Australia?’ అని టైప్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా అనే పదం చాలా ప్రమాదకరమని సోఫోస్ చెప్పాడు. టైప్ చేసిన తర్వాత వినియోగదారు తెలియకుండానే ఫలితంపై క్లిక్ చేసినప్పుడు, సున్నితమైన సమాచారం స్వయంచాలకంగా హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతుంది. గట్‌లోడర్ అనే ప్రోగ్రామ్ ద్వారా బ్యాంక్ ఖాతా సమాచారం వంటి సున్నితమైన డేటా సమాచారం దొంగిలించబడుతుంది. ఇది సమాచారాన్ని దొంగిలించడమే కాకుండా వినియోగదారులు తమ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుందని సోఫోస్ తెలిపింది.