బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఒకే రోజులో పౌండ్ బంగారం ధర రూ.1,140 తగ్గింది. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.10,037, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,200 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 తగ్గింది. దీంతో రూ.92,000 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1140 తగ్గింది. దీంతో రూ.1,00,370 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇలాంటి ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,150కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520. నేడు కిలో వెండి రూ.100 తగ్గింది. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,19,800గా అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,09,800గా ట్రేడవుతోంది.