TTD Calendar 2025: ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్లు.. ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌, పోస్టల్‌ పద్ధతుల్లో వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇకపై టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చని చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

శ్రీపద్మావతితోపాటు శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి, శ్రీ పద్మావతిల ఫొటోలతో పెద్ద సైజులో క్యాలెండర్‌లను తయారు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలు కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వివరించారు.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాలనుకునే వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

TTD official login link