TS Inter results: అనుకున్న జిల్లా నే టాప్… ఎంత శాతం తో అంటే?…

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మొత్తం పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 65.96 శాతం మంది పాస్ అయ్యారు. ఇది గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా మెరుగైన ఫలితం. ప్రైవేట్ విద్యార్థుల పాస్ శాతం 65.65గా నమోదు కాగా, రెగ్యులర్ విద్యార్థుల పాస్ శాతం తక్కువగా ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఫలితాలను హైదరాబాద్లో మంత్రులు భట్టి విక్రమార్క మరియు పోన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మొదటి సంవత్సరానికి చెందిన విద్యార్థులలో 9.97 లక్షల మంది పరీక్షలు రాశారు. వారిలో పాస్ అయిన విద్యార్థుల శాతం 60.01గా ఉంది.

రెండో సంవత్సరం ఫలితాలు బాగున్నాయ్

రెండో సంవత్సరానికి చెందిన ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చాయి. ఈసారి 71.57 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో బాలికలు మళ్లీ ముందుండగా, బాలుర పాస్ శాతం తక్కువగానే ఉంది. బాలికల పాస్ శాతం 77.21గా ఉండగా, బాలురవి 64.84 శాతమే.

Related News

జిల్లాల వారీగా పాస్ శాతం

ఫలితాలలో జిల్లాల వారీగా కూడా స్పష్టమైన తేడాలు కనిపించాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 80.12 శాతం విద్యార్థులు పాస్ కాగా, కొమురంభీమ్ జిల్లాలో కేవలం 54.93 శాతం మాత్రమే పాస్ అయ్యారు. ఇది అక్కడ విద్యా ప్రమాణాలను ప్రతిబింబించే అంశంగా చూస్తున్నారు.

ఫలితాలు ఎలా చూడాలి?

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ [tgbie.cgg.gov.in] లో ఫలితాలు చెక్ చేయవచ్చు. అయితే చాలా మంది ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి రావడంతో సైట్ ల్యాగ్ అవుతోంది. అలాంటి సందర్భాల్లో కొంత సమయం వేచి చూసి మళ్లీ ట్రై చేయడం మంచిది.

రివెరిఫికేషన్, రీ కౌంటింగ్ వివరాలు

ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే, మే 22 లోగా రివెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో లభ్యం. ఒక్క పేపర్‌కు రూ.600, స్కానింగ్ చేసేందుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడే ఫలితం చూడకపోతే వెబ్‌సైట్ మళ్లీ డౌన్ అయిపోవచ్చు! ఫలితం మిస్ కాకుండా వెంటనే చెక్ చేయండి. తక్కువ మార్కులు వచ్చినా నిరాశ పడకండి, రివెరిఫికేషన్, సప్లిమెంటరీ ఉన్నాయ్.

ఈ పోస్టును షేర్ చేయండి – మీ స్నేహితులు కూడా వెంటనే ఫలితాలు చూసేయాలి కదా!