
పూరీలు అంటే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకూ ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. కానీ పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారయ్యే “పాకం పూరీలు” రుచిలో మాత్రం మరో స్థాయిలో ఉంటాయి. అయితే చాలా మంది ఈ స్వీట్ పూరీలు చేసేటప్పుడు కొంతసేపటికి గట్టిపడిపోతాయని అంటుంటారు. అసలు సరైన కొలతలతో, సింపుల్ టిప్స్ పాటిస్తే ఈ పూరీలు రెండు వారాల వరకూ కూడా జ్యూసీగా, తీపిగా నిలుస్తాయి.
పూరీ పిండిని తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు మైదా తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చేతితో బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలిపి అరగంట పాటు నాననివ్వాలి. ఈ టైంలోనే పాకం తయారుచేయవచ్చు. ఒక కడాయిలో అర కిలో చక్కెర, కొద్దిగా నీళ్లు వేసి మిశ్రమాన్ని మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మరిగించి, చివర్లో యాలకుల పొడి వేసి గట్టిగా కలపాలి.
ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ప్రతి ఉండను చపాతీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. కడాయిలో నూనె బాగా వేడి అయ్యాక అందులో పూరీలు వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. వేడివేడిగా తీసిన పూరీలను వెంటనే పాకంలో వేసి 30 సెకన్లపాటు నానబెట్టాలి. ఆపై ప్లేట్లోకి తీసుకుని వేడిగా లేదా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు.
[news_related_post]ఈ పాకం పూరీలు తీపిగా, జ్యూసీగా ఉండేలా చేసే సీక్రెట్ పాయింట్ మాత్రం పాకంలోనే ఉంది. చక్కెర పాకం పర్ఫెక్ట్గా తయారైతే, పూరీలు రెండు వారాల వరకూ కూడా తీపిగా నిల్వ ఉంటాయి. అదికూడా ఫ్రిజ్‌లో పెట్టకుండానే. ఇక మీరు మైదా బదులుగా గోధుమపిండి వాడినా ఈ పూరీలు చాలా టేస్టీగా వస్తాయి. మాదిరిగా గరిటెల నూనె తప్పనిసరిగా బాగా వేడి అయ్యాకే పూరీలు వేయాలి. అప్పుడే అవి తక్కువ ఆయిల్‌తో కరకరలాడుతూ వస్తాయి.
ఇప్పుడు మీరు కూడా ఈ సింపుల్ పద్ధతిలో “పాకం పూరీలు” ట్రై చేయండి. వేడి వేడి గానీ, చల్లారిన తర్వాత గానీ, ఈ స్వీట్ పూరీల రుచి మర్చిపోలేరు. ఒకసారి చేస్తే మాత్రం ప్రతి పండుగకి ఇదే స్పెషల్‌గా చేయాలనిపిస్తుంది.