
ఇప్పుడు ఆరోగ్యానికి ప్రాధాన్యం పెరిగిపోయిన రోజుల్లో చాలామంది మిల్లెట్ ఫుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జొన్నతో చేసిన వంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసాక అందరూ ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. అయితే, జొన్న అంటే చాలా మందికి ముందుగా జొన్న రొట్టే గుర్తుకు వస్తుంది. కానీ అవి తయారు చేయడం కొంత కష్టమే. అలాంటప్పుడు జొన్న దోశలు చాలా ఈజీ, టేస్టీ ఆప్షన్‌గా ఉంటాయి.
ఈ జొన్న దోశలు చేసే విధానం చాలా సింపుల్. టైమ్ కూడా ఎక్కువ పట్టదు. బ్రేక్‌ఫాస్ట్‌కి బాగా సరిపోతుంది. పైగా ఇవి చిన్న పిల్లలకూ చాలా బాగా నచ్చేస్తాయి. రవ్వ దోశల కంటే మెత్తగా, రుచిగా ఉంటాయి. జొన్న పిండి, బియ్యప్పిండి కలిపి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక మిశ్రమం తయారు చేయాలి. దీనిలో నీళ్లు పోసి రవ్వ దోశలా మిక్స్ చేస్తే చాలు.
పెనం మీద నూనె రాసుకుని, మిశ్రమాన్ని చుట్టూ పోసుకుంటూ మిడిల్లో కూడా పోసుకోవాలి. అంచుల వెంట నూనె రాసి, లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చాలి. ఓ వైపు గోల్డెన్ బ్రౌన్‌గా కాలిన తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టాలి. మరోవైపు కాల్చాల్సిన పనిలేదు. అప్పుడే దోశ మెత్తగా ఉంటుందట. ఇలా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకుంటూ మనకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా తినొచ్చు. ఏ చట్నీతో తిన్నా కమ్మగా ఉంటాయి.
[news_related_post]ఇంకా బాగా రుచిగా కావాలంటే క్యారెట్ తురుము కూడా కలపొచ్చు. పచ్చ జొన్న పిండి అయితే రుచి మామూలుగా ఉండదు. కొంతమంది పెరుగు, వంటసోడా కూడా కలుపుతారు. అయితే అవి అవసరం లేదు. పెరుగు కలిపితే బాగా మెత్తగా అవుతాయి. మిక్సీలో జొన్న పిండి, బియ్యప్పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు వేసి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది.
ఒక్కసారి ఈ జొన్న దోశలు ట్రై చేస్తే మళ్లీ రవ్వ దోశను గుర్తు పెట్టుకోరు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి ఇది ఓ బెస్ట్ చాయిస్. మిస్ అయితే మాత్రం మీరు లాస్‌లోనే ఉంటారు!