
రామేశ్వరం క్యాఫే లో దోసె అంటే ఫేమస్ పేరు. ఎర్రగా, నెయ్యి వాసనతో, పక్కన ఉన్నవారిని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాంటి క్రిస్పీ, తియ్యని వాసనతో ఉండే దోసెను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హోటల్స్ లో లైన్ లో కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని ఓసారి ట్రై చేస్తే మళ్లీ బయట తినాలని అనిపించదు. అంత రుచిగా, అంత సింపుల్గా దీన్ని తయారు చేయొచ్చు. ఇక దోసెపై చల్లే గన్ పౌడర్ మసాలా కూడా రెడీగా తయారుచేసుకుని నెలల పాటు నిల్వ పెట్టుకోవచ్చు.
ముందుగా మినపగుళ్లు, వాడుక బియ్యం, ఉడికించిన బియ్యం, అటుకులు, మెంతులు అన్నింటిని ఒకే గిన్నెలో వేసి బాగా కడిగి, నీళ్ళు పోసి ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి మృదువుగా గ్రైండ్ చేయాలి. పిండి కొంచెం రవ్వలా ఉంటే దోసె బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిని పెద్ద గిన్నెలో తీసుకుని చేత్తో బాగా కలపాలి. అలా కలిపాక రాత్రంతా పులియనివ్వాలి.
తరువాత రోజు ఉదయం పిండిని మళ్ళీ కలిపి దోసె వేసే ముందు కొద్దిగా పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ చక్కెర కలపాలి. చక్కెర వలన దోసెకు రంగు బాగా వస్తుంది. పెన్ను చాలా వేడి కాకముందే దోసె వేసి, పైన కొద్దిగా నెయ్యి చల్లి, గన్ పౌడర్ చల్లి, లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కాల్చాలి. క్రిస్పీగా, ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని అందులోనే తినేయాలి.
[news_related_post]ఇప్పుడు దోసెకు ఫుల్ ఫ్లేవర్ ఇచ్చే గన్ పౌడర్ తయారీ కూడా చూసేద్దాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, కశ్మీరీ మిర్చి, ఎండు మిర్చి అన్నింటినీ ఒక్కొక్కటిగా వేయించి చల్లార్చాలి. తరువాత ఇవన్నీ మిక్సీ లో వేసి ఇంగువ, ఉప్పు కలిపి తేలికగా గ్రైండ్ చేయాలి. ఈ పౌడర్ గాజు సీసాలో పెట్టుకుంటే మూడునెలల పాటు బాగా నిల్వ ఉంటుంది.
ఈ పద్ధతిలో తయారుచేసిన రామేశ్వరం దోసెను ఓసారి ఇంట్లో ట్రై చేస్తే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ మీరు రెస్టారెంట్ లో తెచ్చారని అనుకుంటారు. ఇలాంటి రుచి ఇంట్లోనే వస్తుందనుకుంటే అది మీ హస్తకౌశలం వల్లే.