
వడలు అంటే మనలో చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. బయట మిర్చీ బండ్లపై అమ్మే మసాలా వడలు ఎంత కరకరలాడుతూ, రుచిగా ఉంటాయో అంతే ఇంట్లోనే ఆరోగ్యంగా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ లేదా జీర్ణ సమస్యలతో శనగపిండి వాడే వడలు తినలేని వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. శనగపిండి బదులుగా, జొన్న పిండి, బియ్యప్పిండి, రవ్వతో కలిసి చేసుకునే ఈ వడలు రుచిలో మాత్రం ఏమాత్రం తక్కువ ఉండవు.
ఇవి తయారు చేయడం చాలా సింపుల్. కేవలం పదిహేను నిమిషాల్లోనే మీరు టేస్టీ, కరకరలాడే స్నాక్స్ సిద్ధం చేసుకోగలరు. ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటినీ సన్నగా తరిగి పక్కన పెట్టాలి. శనగపప్పును అరగంట వరకు నానబెట్టాలి. ఇక పిండి కోసం జొన్న పిండి, బియ్యప్పిండి, ఉప్మారవ్వ, వాము, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు ఇలా అన్నింటిని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటన్నింటినీ తడిగా పిండుతూ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
ఇంతలో నానబెట్టిన శనగపప్పును కూడా మిశ్రమంలో కలిపితే తినే సమయంలో కరకరలాడే టెక్స్చర్తో వడలు రెడీ అవుతాయి. చివరగా కొద్దిగా నూనె కూడా కలిపితే బాగా క్రిస్పీగా అవుతాయి. నీళ్లు ఎక్కువగా కలపకుండా పిండి ముద్దలా తయారవ్వాలి.
[news_related_post]ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి, చిన్న చిన్న ముద్దలుగా చేసి నెమ్మదిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. శనగపిండి వడల్లా త్వరగా వేగవు కాబట్టి ఓపికగా వేయించాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి రెడీ అయిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేస్తే పర్ఫెక్ట్ ఈవెనింగ్ స్నాక్ అయ్యిపోతుంది.
ఒక్కసారి ఈ వడలు చేసి చేసారంటే, ఇక ఇంట్లో శనగపిండి వడలు చేయాలనిపించదు. ఆరోగ్యంగా ఉండాలి కానీ రుచి మీద కాంప్రమైజ్ చేయకూడదనుకునే వాళ్లకు ఇది బెస్ట్ రిసిపీ. మీరు ఇప్పటికీ ట్రై చేయకపోతే మిస్ అవుతున్నారు!