Donald Trump: హెచ్ 1బీ వీసాదారులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. ఇక ఆ విధానం రద్దు!

అమెరికా ఫస్ట్ అనే నినాదంతో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుండి వచ్చిన వారి కంటే అమెరికన్ పౌరులు అన్ని రకాల ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీసాల గడువు ముగిసిన, తప్పుడు పత్రాలతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వారి దేశాలకు తిరిగి పంపే కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 205 మంది భారతీయులతో కూడిన విమానం బుధవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం కోసం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, అమెరికాలో H1B, L1 వీసాలు ఉన్న ఉద్యోగులు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటివరకు H1B, L1 వీసాలు కలిగి ఉన్న వారి చెల్లుబాటు గడువు ముగిసినప్పుడు వారి వీసాలు స్వయంచాలకంగా పునరుద్ధరించబడతాయి. ఈ వీసా ఆటో-పునరుద్ధరణ వ్యవస్థను గతంలో అధికారంలో ఉన్న జో బైడెన్ ప్రవేశపెట్టారు. అయితే, ఇటీవల ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు బైడెన్ అందించిన ఈ వీసాల ఆటో-పునరుద్ధరణ అవకాశాన్ని రద్దు చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు మరో పెద్ద షాక్ వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. H-1B, L-1 వర్క్ వీసాల కోసం ఆటో-రెన్యూవల్ సిస్టమ్ వలస అమలుకు చాలా ప్రమాదకరమని సెనేటర్లు అన్నారు.

బైడెన్ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. H-1B, L-1 వీసాల చెల్లుబాటును పొడిగించింది. గతంలో, వీసా చెల్లుబాటు 180 రోజులు మాత్రమే. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు.. డెమోక్రటిక్ ప్రభుత్వం దానిని 540 రోజులకు పెంచింది. గత నెల 13న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం దీనిని ఖరారు చేసింది. దీని వల్ల వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H-1B, L-1 వీసా హోల్డర్ల భాగస్వాములు చాలా ప్రయోజనం పొందారు. వర్క్ వీసాలపై పనిచేసే భారతీయులు కూడా ప్రయోజనం పొందారు.

Related News

అయితే, బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు అడ్డంకిగా మారింది. ఈ ఆటో రెన్యూవల్ అమలులో ఉంటే, అది కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియంత్రణ, కఠినమైన వీసా నియమాలకు అడ్డంకిగా మారుతుందని సెనేటర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ గత నెల 31న కాంగ్రెస్ సమీక్ష చట్టం కింద ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. వర్క్ పర్మిట్‌లను స్వయంచాలకంగా 540 రోజులు పొడిగించే నిబంధనను ప్రవేశపెట్టడం వలస చట్టాల అమలును దెబ్బతీస్తుందని, అమెరికన్ భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుందని సెనేటర్లు అన్నారు.