ఏపీలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలోని సూళ్లూరుపేట పట్టణం సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రావెల్ బస్సు 34 మంది ప్రయాణికులతో పాండిచ్చేరి నుండి విజయవాడకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స కోసం సమీపంలోని CHCకి తరలించారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట SI బ్రహ్మనాయుడు సహాయక చర్యలు చేపట్టారు. ట్రావెల్ బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
Accident : ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా.. 17 మందికి గాయాలు

24
Feb