ఈరోజుల్లో చాలా మంది తమ ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కానీ, జూలై 2024లో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైనవిగా మార్చాయి. ఆ తర్వాత రెండు నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచడం చాలా కష్టంగా మారిపోయింది. ఒకవేళ సెకండరీ సిమ్ ను ఉపయోగించకుంటే ఆ నెంబర్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు. TRAI సిమ్ కార్డ్ నియమాలలో కొన్ని మార్పులు చేసింది. ఆ తర్వాత నంబర్ చిన్న ప్లాన్‌లో కూడా చాలా కాలం పాటు యాక్టివ్‌గా పెట్టుకోవచ్చు. ఈ కొత్త నిబంధన వల్ల కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం ఉంటుంది.
TRAI కొత్త నిబంధనల కారణంగా.. ఇప్పుడు చోటు రీఛార్జ్‌తో కూడా సెకండరీ సిమ్ ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంటుంది. TRAI కన్స్యూమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం.. రీఛార్జ్ ముగిసిన తర్వాత కూడా మీ SIM కార్డ్ 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. అంటే.. కొంత సమయం వేచి ఉన్న తర్వాత కూడా మీరు రీఛార్జ్ పూర్తి చేసుకోవచ్చు.
Related News
ఇదే సమయంలో మీ సిమ్ రీఛార్జ్ ముగిసినప్పటికీ దానిలో కనీసం రూ. 20 బ్యాలెన్స్ మిగిలి ఉంటే, మీ కంపెనీ మీకు 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. దీని ప్రకారం.. కేవలం రూ. 20 ఖర్చు చేయడం ద్వారా మీరు మీ సిమ్‌ను 120 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్‌టెల్, VI, BSNL వంటి అన్ని నెట్‌వర్క్‌లకు ఈ నియమం వర్తిస్తుందని TRAI తెలిపింది.
ఇది మాత్రమే కాదు.. కొత్త నియమం తర్వాత 120 రోజులు గడిచిన తర్వాత కూడా TRAI మీకు సిమ్‌ను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి 15 రోజుల సమయం ఇస్తుంది. అయితే, ఈ 15 రోజుల్లోపు సిమ్ కార్డు రీఛార్జ్ చేయకపోతే, ఆ నంబర్ పూర్తిగా మూసివేయబడుతుంది. దీంతో ఇది మరొకరికి కూడా జారీ చేయబడవచ్చు.