తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లోఅతి భీకర వానలు కురుస్తున్నాయి. ఫలితంగా, ఎప్పుడూ చూడని వరదలు ముంచేత్తాయి. చాల ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించింది. అంతేకాదు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో జీవనం అస్తవ్యస్తం గానే ఉంది.
ఈ నేపథ్యంలో మరో పిడుగు లాంటి వార్త .. బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఏపీకి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. మరో రెండు రోజుల్లో అల్పపీడనంపై కచ్చితమైన సమాచారం అందే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Related News
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నీట మునిగింది. అక్కడ రోడ్లు సముద్రాన్ని తలపిస్తాయి. వరద అంటే తెలియని వారు కూడా ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు వరదల కారణంగా ఇంట్లోని విలువైన వస్తువులు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి సంపాదించిన జీవితం నీటి పాలేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.