
మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటంతో పాటు, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 18 వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు అమరావతి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30 – 40 K.M వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.