పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ పదార్థాన్ని కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని కొద్ది మందికే తెలుసు. అదే సూపర్ ఫుడ్ అని పిలిచే మఖానా. వీటినే తామరగింజలు అని కూడా అంటారు. సాధారణంగా అందరూ మఖానాను అల్పాహారంగానే తీసుకుంటారు. ఇలా చిరుతిండిగా తినే బదులు వేసవి కాలంలో మఖానా రైతా తిని చూడండి. ఎండలకు నీరసించిపోకుండా ఎంత ఉత్సాహంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ప్రధాని మోదీ కూడా ఈ రెసిపీని ఏడాదిలో 300 రోజులు తినడం వల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని అంటున్నారు. మరి, ఆలస్యమెందుకు. పెరుగుతో తయారు చేసే మఖానా రైతా తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 కావాలసిన పదార్థాలు:

– పెరుగు – 2 కప్పులు
– మఖానా – ఒక కప్పు
– జీలకర్ర పొడి – తగినంత
– ఉప్పు – తగినంత
– కారం – 2 టేబుల్ స్పూన్లు

Related News

తయారీ విధానం:
మఖానా రైతా చేయడానికి ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి. అందులో మఖానా వేసి, జీలకర్ర పొడి, రుచికి తగిన ఉప్పు, కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. అంతే.. ఎంతో రుచికరమైన, పోషకాలున్న మఖానా రైతా తయారైపోతుంది. దీనిని వేసవిలో తరచూ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలో వేడి తగ్గించి చల్లబరుస్తుంది.

 మఖానా ఆరోగ్య ప్రయోజనాలు:

 కడుపు ఆరోగ్యం
పెరుగులో కడుపు ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ క్రమం తప్పకుండా వినియోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం చేస్తుంది. ఇక మఖానాలోని ఫైబర్ కూడా కడుపు సమస్యలను తగ్గిస్తుంది. వేసవి కాలంలో ఈ రెండు పదార్థాలు కలిపిన రైతాను తీసుకోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

 శక్తి
వేసవిలో ఎండలు శరీరంలోని శక్తిని చాలా వేగంగా హరించివేస్తాయి. చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటికి వచ్చేస్తుంది. త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. అందుకే పెరుగు, మఖానా కలిపిన రైతా తింటే తక్షణమే ఎనర్జీ వస్తుంది. మఖానాలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. పెరుగులోని కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు మఖానాతో కలిపి తిన్నప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీరానికి వెంటనే శక్తినివ్వడంతో పాటు ఎముకలను బలంగా చేస్తాయి.

 హైడ్రేషన్
వేసవిలో శరీరంలో నీరు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. దాహం వేసిన ప్రతిసారీ నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ బదులుగా పెరుగు తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ కాదు.

కొలెస్ట్రాల్
ఈ రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అది తగ్గించుకోలేక నానా తంటాలు పడుతుంటారు. కొలెస్ట్రాల్ తగ్గించుకోకపోతే ఇతర వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా మఖానా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించుకోవచ్చు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

మఖానాలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని తక్కువ ప్రొటీన్, సోడియం బీపీ నియంత్రించేందుకు సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇందులో గ్లైసెమిక్ స్థాయి కూడా తక్కువే కాబట్టి డయాబెటిస్ పేషెంట్లకు మరీ మంచిది. ఇందులోని సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకలను దృఢంగా చేస్తాయి. కాబట్టి, ఈ అల్పాహారాన్ని మీరు కూడా ఇప్పటినుంచి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు.