ఏపీలో వేడి తీవ్రత పెరిగింది. శనివారం రేణిగుంటలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 41-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Related News
81 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. శనివారం రోజున తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7°Cగా, విజయనగరంలో 41.1°Cగా , తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41°Cగా, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.8°Cగా, వైఎస్ఆర్ జిల్లా మద్దూరులో 40.7°Cగా, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7°Cగా అధిక ఉష్ణోగ్రతలు వచ్చాయి.
ఆదివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 41-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అల్లూరి సీతారామరాజు-11, అనకాపల్లె జిల్లా-8 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని, మరో 30 మండలాలపై వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
సోమవారం 24 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 57 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. సోమవారం చిత్తూరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు-8, అనకాపల్లె-16, అనంతపురం-4, అన్నమయ్య-1, కుప్పం మండలాల్లో (30) వేడిగాలులు వీస్తాయని చెబుతున్నారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు, ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ తీరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆదివారం రాష్ట్రంలోని చాలా చోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.