ఇప్పటి రోజుల్లో ఉద్యోగం లేని వారు, అదనపు ఆదాయం కావాలనుకునేవారు చిన్న పెట్టుబడితోనే పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా, అధిక డిమాండ్ ఉండే బిజినెస్ ఎంచుకుంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయం పొందొచ్చు. అలా ఎవరైనా సులభంగా ప్రారంభించగల బిజినెస్ “మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారం”.
ఎందుకు మొబైల్ యాక్సెసరీస్ బిజినెస్ ప్రారంభించాలి?
- ఎప్పటికీ డిమాండ్ తగ్గదు – ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటంతో యాక్సెసరీస్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
- తక్కువ పెట్టుబడి – అధిక లాభం – కేవలం ₹5,000 – ₹10,000తోనే స్టార్ట్ చేయొచ్చు.
- ఎక్కడైనా ప్రారంభించొచ్చు – వీధిలో, కాలనీలో, మార్కెట్‌లో, షాపింగ్ మాల్ ముందు, బస్టాండ్ వద్ద.. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు.
- వేగంగా పెరుగుతున్న బిజినెస్ – ఫెస్టివల్ సీజన్‌లో డిమాండ్ మరింత పెరుగుతుంది.
ఏయే మొబైల్ యాక్సెసరీస్ సేల్ చేయొచ్చు?
- స్క్రీన్ గార్డ్స్ & మొబైల్ కవర్లు – ₹10-₹50 పెట్టుబడి.. ₹50-₹150 లాభం..
- చార్జర్లు & డేటా కేబుల్స్ – ₹50-₹100 పెట్టుబడి.. ₹150-₹300 లాభం..
- ఇయర్‌ఫోన్స్ & హెడ్‌ఫోన్స్ – ₹100-₹200 పెట్టుబడి.. ₹300-₹500 లాభం..
- మొబైల్ స్టాండ్ & హోల్డర్లు – ₹50 పెట్టుబడి.. ₹150-₹200 లాభం..
- సౌండ్బార్ స్పీకర్లు – ₹300 పెట్టుబడి.. ₹800-₹1000 లాభం..
- పవర్ బ్యాంక్‌లు – ₹500 పెట్టుబడి.. ₹1200-₹1500 లాభం..
మొబైల్ యాక్సెసరీస్ ఎక్కడ కొనుగోలు చేయాలి?
- ఢిల్లీలో ఉంటే గఫ్ఫార్ మార్కెట్ – ఇది మొబైల్ యాక్సెసరీస్‌కు బిగ్గెస్ట్ హోల్‌సేల్ మార్కెట్.
- మీ నగరంలోని హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా తక్కువ ధరకు బల్క్‌లో కొనుగోలు చేయొచ్చు.
- ఆన్‌లైన్ హోల్‌సేల్ వెబ్‌సైట్లు కూడా ఉపయోగించొచ్చు.
లాభాలు ఎంత వస్తాయి?
- 2-3 రెట్లు లాభం సాధించవచ్చు..
- ₹10 పెట్టుబడి పెట్టిన వస్తువు ₹30-₹50కి అమ్మవచ్చు.
- ₹100 పెట్టుబడి పెట్టిన వస్తువు ₹250-₹400కి అమ్మవచ్చు.
- మొదట ₹5,000 పెట్టుబడితో స్టార్ట్ చేసి.. ఆదాయాన్ని పెంచుకుంటూ ₹50,000+ వరకు ప్రతీ నెల సంపాదించొచ్చు.
ఎందుకు ఈ బిజినెస్ మిస్ కాకూడదు?
- ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ సమయం వృథా చేసుకోవద్దు.
- తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తెచ్చుకునే అవకాశం కోల్పోవద్దు.
- ఇప్పుడే స్టార్ట్ చేసి నెలకు ₹50,000 వరకు ఆదాయం పొందండి.
ఇంకెందుకు ఆలస్యం? తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్ బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించండి.