మార్చి ముగుస్తోంది… ఏప్రిల్ రాబోతోంది… కొత్త నెలతో పాటు పెట్రోల్, బ్యాంకింగ్, TDS, GST, UPI, LPG ఇలా ఎన్నో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపులకు, ఖర్చులకు పెద్ద మార్పులు తీసుకురావొచ్చు. ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉంది.
అందుకే, ఏప్రిల్ 1 నుంచి మారనున్న ప్రధానమైన ఆర్థిక నియమాలను ఒకసారి చూద్దాం…
LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు
- ప్రతి నెలా 1వ తేదీన LPG ధరలు మార్చబడతాయి.
- గృహ వాడక గ్యాస్ & వాణిజ్య సిలిండర్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
- మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి.
UPI చెల్లింపుల్లో ప్రధాన మార్పు
- ఏప్రిల్ 1 నుంచి UPI వ్యవస్థలో కొత్త భద్రతా ఫీచర్ అమలవుతుంది.
- Mobile Number Revocation List (MNRL) అనే కొత్త విధానం ద్వారా నకిలీ లావాదేవీలను తగ్గించనున్నారు.
- మార్చి 31లోగా బ్యాంకులు పాత మొబైల్ నంబర్లను UPI నుంచి తొలగించాలి.
- నమోదు చేసిన మొబైల్ నంబర్ మారితే UPI చెల్లింపులు పనిచేయవు.
GST నిబంధనల్లో మార్పు – జరిమానా అపాయం
- ఏప్రిల్ 1 నుంచి Input Tax Distributor System (ISD) అమల్లోకి వస్తుంది.
- ఇప్పటి వరకు ITC (Input Tax Credit) తీసుకోవడం ఐచ్ఛికం.
- కానీ ఇప్పుడు ITC నమోదు లేకపోతే ఆ లావాదేవీలకు క్రెడిట్ రాదు.
- ఈ నిబంధన ఉల్లంఘిస్తే ₹10,000 వరకు జరిమానా పడొచ్చు.
బ్యాంకింగ్ నిబంధనల్లో కొత్త మార్పులు
- SBI, PNB, Canara, HDFC వంటి బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి.
- ATM నుంచి నెలకు 3-5 సార్లు ఉచితంగా నగదు డ్రా చేసే అవకాశం.
- ఇందుకు మించి తీయాలంటే అదనపు ఛార్జీలు పడొచ్చు.
- బ్యాంకుల్లో నూతన మినిమం బ్యాలెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
TDS, TCS నిబంధనల్లో పెద్ద మార్పులు
- పెద్దగా మారే అంశం TDS (Tax Deducted at Source) నిబంధనలు.
- సీనియర్ సిటిజన్ల కోసం TDS పరిమితి ₹1 లక్షకు పెంచారు.
- అద్దె ఆదాయంపై TDS పరిమితి ₹2.4 లక్షల నుంచి ₹6 లక్షలకు పెరిగింది.
- అంతర్జాతీయ లావాదేవీల కోసం LRS (Liberalised Remittance Scheme) పై TCS పరిమితి ₹10 లక్షలకు పెరిగింది.
- ఎడ్యుకేషన్ లోన్లపై 0.5% TCS పూర్తిగా తొలగించారు.
- డివిడెండ్ ఆదాయంపై TDS పరిమితి ₹10,000కు పెంచారు.
ఈ మార్పులు మీ డబ్బు పై ఏ ప్రభావం చూపించనున్నాయో తెలుసుకోవాలి
- పెరుగుతున్న TDS, GST నిబంధనలు మీ పొదుపులపై ఎఫెక్ట్ చేయవచ్చు.
- బ్యాంకింగ్, ATM, UPI మార్పులతో మీ లావాదేవీలు కష్టతరం కావొచ్చు.
- LPG ధరలు మారితే నెలవారీ ఖర్చులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
ఈ మార్పులు మీ డబ్బును ప్రభావితం చేయకముందే. వెంటనే తెలుసుకోండి, తగిన చర్యలు తీసుకోండి.