పడుకునే ముందు ఈ పనులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.
1. రాత్రిపూట ఎక్కువ ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. అలాగే, పడుకునే ముందు సిగరెట్లు తాగకూడదు లేదా మద్యం సేవించకూడదు. అలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
3. పడుకునే ముందు 6 గంటల పాటు టీ లేదా కాఫీ తాగవద్దు. ఇవి మీ ఆరోగ్యానికి హానికరం.
4. పడుకునే ముందు టీవీ చూడటం లేదా ఫోన్ వాడటం వల్ల త్వరగా నిద్రపోకుండా ఉంటుంది. అందుకే పడుకునే ముందు ఈ పనులు చేయకూడదు.
5. అలాగే, పడుకునే ముందు వేయించిన ఆహారాలు తినకూడదు.
6. పడుకునే ముందు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.