కొత్త నెలలో తొలి రోజునే బ్యాంకు ఖాతాదారులకు శుభవార్తలు వెల్లువలా వస్తున్నాయి. సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో రెండు ప్రముఖ బ్యాంకులు మార్పులు చేశాయి. అవే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు IDFC ఫస్ట్ బ్యాంక్. ఈ రెండు బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం కొత్త వడ్డీ రేట్లు ప్రవేశపెట్టాయి. ఈ మార్పులు మే 1, 2025 నుంచే అమలులోకి వచ్చాయి. అంటే మీరు ఈ నెలలో డబ్బు పెట్టుబడి పెడితే మరింత లాభం పొందే అవకాశం ఉంది.
శివాలిక్ బ్యాంక్ ఇచ్చిన గొప్ప గిప్ట్
ముందుగా శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే, ఈ బ్యాంక్ సర్వసాధారణ సేవింగ్స్ ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఇప్పుడు 2.50 శాతం నుంచి 8.20 శాతం వరకు వడ్డీ ఇవ్వబోతోంది. ఇది నిజంగా అత్యధికంగా చెప్పుకోవచ్చు. చిన్న పెట్టుబడి పెట్టే వారు నుండి పెద్ద మొత్తాలు జమ చేసే ఖాతాదారుల వరకూ అందరికీ ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
ఎంత అమౌంట్‌కు ఎంత వడ్డీ
మీ ఖాతాలో ఒక లక్ష రూపాయల వరకు ఉంటే 2.50% వడ్డీ రేటు లభిస్తుంది. ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పెడితే 3.25% వడ్డీ లభిస్తుంది. ఐదు లక్షల నుంచి పదిలక్షల వరకు 3.50% వడ్డీ ఉంటుంది. పదిలక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు 4% వడ్డీ లభిస్తుంది.
Related News
ఇక పెద్ద మొత్తాలు పెట్టే వారికి మరింత లాభం. ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు 6% వడ్డీ రేటు ఉంటుంది. యాభై లక్షల నుంచి 5 కోట్ల వరకు 7% వడ్డీ. 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు 7.25%. 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు 7.50%. 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు 7.95%.
20 కోట్ల పైగా డబ్బు ఉన్న ఖాతాలపై 8.20% వడ్డీ అందుతుంది. ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇచ్చే అత్యధిక వడ్డీ రేటులో ఒకటి. అంటే బిజినెస్ వాళ్లకు, పెద్ద పెట్టుబడి పెట్టేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
IDFC ఫస్ట్ బ్యాంక్ కూడా పోటీగా వడ్డీ పెంచింది
ఇప్పటివరకు మంచి వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్‌లలో IDFC ఫస్ట్ బ్యాంక్ ఒకటి. ఇప్పుడు ఈ బ్యాంక్ కూడా కొత్త వడ్డీ రేట్లు ప్రవేశపెట్టింది. మే 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ రేట్లు ఖాతాదారులకు మరింత లాభం చేకూరుస్తాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ 3% నుంచి 7.25% వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది.
5 లక్షల వరకు డబ్బు పెట్టుంటే 3% వడ్డీ లభిస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 5% వడ్డీ అందుతుంది. ఇక 10 లక్షల నుంచి ఏకంగా 25 కోట్ల వరకు డబ్బు పెడితే 7.25% వడ్డీ లభిస్తుంది. ఇది సాధారణంగా సర్వసాధారణ ఖాతాదారులకూ చాలా పెద్ద ఆఫర్.
ఇక 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు డబ్బు పెట్టిన వారికి 6.50% వడ్డీ లభిస్తుంది. 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు అయితే 6% వడ్డీ ఉంటుంది.
ఇవి మామూలు రేట్లు కావు – మీ డబ్బుకి అదనపు ఆదాయం
ఈ రెండు బ్యాంకుల తాజా నిర్ణయాలు ఖాతాదారులకు నిజమైన లాభాన్ని అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడులు పెడితే కానీ, సాదారణ సేవింగ్స్ ఖాతాలోనూ డబ్బు జమ చేసి వడ్డీ పొందే ఛాన్స్ ఇప్పుడు ఉంది. ఈ కొత్త వడ్డీ రేట్లు చూసిన తర్వాత ఖాతాదారులు తమ డబ్బు ఎక్కడ పెట్టాలో ఓసారి ఆలోచించాల్సిందే.
ఈ నెల నుంచే ప్లాన్ చెయ్యండి
ఇప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బును సేఫ్‌గా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ టైం. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టాలనుకునేవారు వెంటనే ఆలోచించండి. ఎందుకంటే ఈ వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిపోతాయో చెప్పలేం. ఇప్పుడు ప్లాన్ చేస్తే, సంవత్సరాలు పాటు మంచి వడ్డీ అందుకుంటారు.
మొత్తానికి మాట ఏమిటంటే… మీ డబ్బుకు ఇప్పుడు వడ్డీ ఫలాలు ఖచ్చితంగా లభించే టైం ఇది! ఇక ఆలస్యం చేయకండి. శివాలిక్ లేదా IDFC ఫస్ట్ బ్యాంక్‌లో ఖాతా తెరుచుకోండి లేదా ఇప్పటికే ఉన్నదైతే ఆ డబ్బును వృద్ధిచేసుకోండి.
మే నెలలో మీ డబ్బు పెరుగుతోందని తెలుసుకున్న ఆనందం మరో స్థాయిలో ఉంటుంది..