ఎవరికైన డబ్బు అత్యవసరంగా అవసరమైనప్పుడు, ఎక్కడి నుండైనా సర్దుబాటు చేయలేనప్పుడు, పర్సనల్ లోన్ ఒక ఎంపికగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. పర్సనల్ లోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సరైన బ్యాంకు కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. అంటే.. ఇతరులకన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చే, ఎక్కువ కాగితపు పనులు అవసరం లేని బ్యాంకు కోసం చూస్తాము. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకును కనుగొనడానికి మీరు అన్ని బ్యాంకులను సందర్శించాల్సి వస్తుంది. లేదా వాటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఏ బ్యాంకులు ఉత్తమ వడ్డీ రేట్లు అందిస్తాయో చూద్దాం.
ఈ కథనంలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్న కొన్ని బ్యాంకుల చూస్తే.. బ్యాంకులు తమ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది కాకుండా.. బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేట్లు రుణ మొత్తం, క్రెడిట్ స్కోరు, రుణ తిరిగి చెల్లించే కాలం వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి.
HDFC, ICICI బ్యాంక్
Related News
మీ ప్రొఫైల్‌ను బట్టి HDFC బ్యాంక్ 10.85% నుండి 24% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పర్సనల్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 6500 + GST చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ICICI బ్యాంక్‌లో వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 10.85 శాతం, 16.25 శాతం మధ్య ఉంటాయి. బ్యాంకు రుణ మొత్తంపై 2% వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది.
కోటక్, ఎస్బిఐ
మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ తీసుకుంటే, వడ్డీ రేటు 10.99% నుండి 16.99% వరకు ఉంటుంది. మీరు లోన్ మొత్తంలో 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు, GST కూడా చెల్లించాలి. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో వడ్డీ రేట్లు 11.45 నుండి 14.60 శాతం వరకు ఉన్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంకులో జనవరి 31, 2025 వరకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.
ఫెడరల్, BOI
ఇక ఫెడరల్ బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై 11.49 నుండి 14.49% రేటుతో వడ్డీని వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు 10.49 నుండి 22.50% వరకు ఉంటాయి. బ్యాంకు రుణ మొత్తంలో 2 శాతానికి సమానమైన ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వెబ్‌సైట్ ప్రకారం.. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10.85% నుండి ప్రారంభమవుతాయి. అయితే, ఇది క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారవచ్చు.