ప్రస్తుత రోజుల్లో చాలా మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. కేవలం మగాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
బట్టతల రావడానికి జన్యువులు, హార్మోన్లు, ఒత్తిడి, మందులు, మానసిక సమస్యలు వంటివి కారణాలు అయ్యుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ హెయిర్ ఫాల్ అవ్వడానికి దోహదపడుతుంది.
ఈ హార్మోన్ జుట్టు రోమాలను చిన్నవిగా, బలహీనంగా చేస్తుంది. ఒత్తిడి, ఆధునిక కాలంలో ఎదుర్కొనే స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంటుంది. మానసిక సమస్యలు కూడా పురుషుల్లో బట్టతల రావడానికి దారి తీస్తాయి. అలాగే కొన్ని మందుల దుష్ర్పభావాల వల్ల కూడా బట్టతల వస్తుందని నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు రాలడానికి ఓ కారణం కావొచ్చు.
Related News
కొంతమందికి అయితే మరీ చిన్న ఏజ్‌లోనే బట్టతల వచ్చేస్తుంది. ఇరవై ఏళ్ల లోపు వారికే వస్తుంది. మరీ కారణం ఏంటో నిపుణులు చెప్పినది ఇప్పుడు తెలుసుకుందాం.. బట్టతల వచ్చే ముందు లక్షణాలు చూసినట్లైతే.. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. గుత్తులు గుత్తులు, ప్యాచెస్ లాగా రాలిపోతుంది. హెయిర్ ఫాల్ అయిన ప్లేస్‌లో స్కిన్ నున్నగా అనిపిస్తుంటుంది. అలాగే జుట్టు ఫోలికల్స్ కనిపించవు. దీనికి కారణాలు జన్యుపరమైనది అండ్ పోషకాహార లోపమని నిపుణులు చెబుతున్నారు.
బట్టతల వచ్చే ముందు హెయిర్ లాస్ అయిన ప్లేస్‌లో దురద పెడుతోంది. కానీ సరైన ఫుడ్ తీసుకుంటే బట్టతల రాకుండా ఉంటుంది. పోలిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి. అలాగే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.