హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి లోనే ఈ విధం గా మండిపోతుంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అని ప్రజలు అల్లాడిపోతున్నారు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎండలు అధికం గానే ఉన్నాయి.. ప్రజలు ఉక్కపోతకు గురిఅయ్యారు..
Related News
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో 37.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ-గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాలు, వనపర్తి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, పెద్దనారాయణపేట, జిల్లాల్లో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.