ఫిబ్రవరి నెలకు ఇంకా అర నెల కూడా కాలేదు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలో శివరాత్రితో చలి తగ్గిపోతుందని అంటున్నారు.. కానీ, శీతాకాలం ముగియకముందే ఎండలు మండిపోతున్నాయి.
గత మూడు, నాలుగు రోజులుగా అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా జిల్లాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 33 నుండి 37 డిగ్రీల వరకు ఉన్నాయి.. అవి ప్రజలను టెన్షన్ కు గురి చేస్తున్నాయి.
ఇప్పుడే ఇలాగే ఉంటే, భవిష్యత్తులో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాత్రిపూట వేడి, పగటిపూట ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఫిబ్రవరి చివరి నుండి ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Related News
ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్‌లో ఎండలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పటికే 3.4 డిగ్రీల మేర నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు..
గత సంవత్సరంతో పోలిస్తే ఈ వేసవిలో ఎండలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. తూర్పు, ఆగ్నేయ గాలులతో ఎండలు పెరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు, కార్బన్ ఉద్గారాలు, పట్టణీకరణ, అటవీ నిర్మూలన దీనికి కారణాలుగా చెబుతున్నారు.
ఫిబ్రవరి 8న తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే…
తెలంగాణలో మండుతున్న ఎండలు..
- – మెదక్..35.8
- – భద్రాచలం.. 35.6
- – మహబూబ్ నగర్.. 35.6
- – ఖమ్మం..35.4
- – రామగుండం.. 34.4
- – నిజామాబాద్..34.1
- – హైదరాబాద్.. 33.5
- – ఆదిలాబాద్.. 32.8
- – హనుమకొండ.. 34
- – నల్గొండ.. 32
మెదక్‌లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.