రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల లోకో పైలట్ CBT-2 పరీక్షను వాయిదా వేసిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రాథమిక ప్రకటన ప్రకారం.. పరీక్ష మార్చి 19న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది. అయితే, కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా పరీక్షను నిర్వహించలేకపోతున్నట్లు RRB వెల్లడించింది. రీషెడ్యూల్ చేసిన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని కూడా ఆ సమయంలో ప్రకటించింది.
మార్చి 20న మొదటి షిఫ్ట్‌లో జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు RRB తన ప్రకటనలో ప్రకటించింది. లోకో పైలట్ CBT-2 పరీక్షల తేదీలను RRB ఇటీవలే రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, లోకో పైలట్ CBT-2 పరీక్షను మే 2 మరియు 6 తేదీల్లో నిర్వహించనున్నారు. వాయిదా వేసిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను రైల్వే బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలో వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.. డైరెక్ట్ లింక్ ఇదిగో!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) 2024 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వారి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్షలు మార్చి 8, 16 మరియు 24 తేదీల్లో నిర్వహించబడిన విషయం తెలిసిందే. ఈ మేరకు SBI ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 600 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియను చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.